- Advertisement -

వివాహేతర సంబంధం.. భయంతో కిటికీ నుంచి దూకిన ట్రైనర్ మృతి

- Advertisement -

వివాహేతర సంబంధాలు ప్రాణాల మీదకు తెస్తాయనే దానికి నిదర్శనంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తన వద్దకు వచ్చే ఒక వివాహితతో ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీయడంతో.. ఒక ఫిట్‌నెస్ ట్రైనర్ తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది. భర్తకు దొరికిపోకూడదనే కంగారులో కిటికీ నుంచి పారిపోవడానికి ప్రయత్నించి.. ప్రమాదవశాత్తు జారి కింద పడి మరణించిన ఈ వింత దురదృష్టకర సంఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్‌లో ఉండే ఒక వివాహిత తన ఫిట్‌నెస్ కోసం స్థానికంగా ఉండే ఒక జిమ్‌లో జాయిన్ అయింది. అక్కడ ఉన్న ఫిట్‌నెస్ ట్రైనర్ వద్ద ఆమె కోచింగ్ తీసుకునేది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం పెరిగి.. అది కాస్తా చివరికి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ తరచూ రహస్యంగా కలుసుకునేవారు. ఈ నేపథ్యంలోనే సదరు వివాహిత భర్త ఇంట్లో లేడనే విషయం తెలుసుకున్న ఆ ఫిట్‌నెస్ ట్రైనర్.. ఆమెను కలవడానికి నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు.

ఇద్దరూ ఇంట్లో ఉన్న సమయంలోనే ఊహించని విధంగా ఆమె భర్త హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రధాన ద్వారం గుండా భర్త లోపలికి వస్తుండటంతో.. లోపల ఉన్న ట్రైనర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎలాగైనా భర్త కంట పడకుండా అక్కడి నుంచి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఆ గదిలో ఉన్న కిటికీని ఎంచుకున్నాడు. కిటికీ గుండా బయటకు దూకి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా.. ఒక్కసారిగా పట్టుతప్పి కింద పడిపోయాడు. తీవ్రమైన గాయాలు కావడంతో ఆ ఫిట్‌నెస్ ట్రైనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. క్షణికానందం కోసం పెట్టుకున్న అక్రమ సంబంధం.. చివరకు ఒకరి ప్రాణాలను బలిగొనడంతో స్థానికంగా ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -