- Advertisement -

ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లేదెవరు..?

- Advertisement -

ఏపీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. వైసీపీ నుంచి రాజ్యసభలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురి పదవీ విరమణతో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. అందులో బీజేపీకి ఈ సారి అవకాశం ఇవ్వలేమని టీడీపీ చెబుతోంది. తమకు సీటు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. జనసేన సైతం తొలి సారి పెద్దల సభలో అడుగు పెట్టాలని భావిస్తోంది. దీంతో.. అసలు ఎవరి రాజ్యసభకు ఎంపిక అవుతారనేది సస్పెన్స్ గా మారుతోంది.

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో తాము మూడు సీట్లు .. జనసేనకు ఒకటి ఇవ్వాలని టీడీపీ ఆలోచన చేస్తోంది. గతంలో బీజేపీకి రెండు స్థానాలను కేటాయించటంతో.. ఈ సారి ఇవ్వలేమనే విధంగా సంకేతాలు ఇస్తోంది. అటు బీజేపీ నాయకత్వం ఏపీ నుంచి ఒక సీటు దక్కించుకనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందు కోసం ఏపీ నుంచి బీజేపీ అభ్యర్ధులుగా ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ప్రధాని దేవగౌడ, తమిళనాడు నేత అన్నామలై, ఎమ్మార్పీఎస్ నేత మంద క్రిష్ణ మాదిగ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా.. కర్ణాటక నుంచి ఒక సీటు మాత్రమే ఎన్డీఏకు ఉండటంతో.. ఏపీ నుంచి దేవగౌడ ను రాజ్యసభ కు పంపాలని బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇక, జనసేన నుంచి మెగాబ్రదర్ నాగబాబు పేరు ప్రచారంలోకి వచ్చినా.. మరో రెండు పేర్లు రేసులో ఉన్నాయి. ప్రముఖ వ్యాపార వేత్త బండారు నరసింహా రావు పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇక.. టీడీపీ నుంచి ప్రస్తుత సభ్యుడు సానా సతీశ్ కు రెన్యువల్ తప్పదని చెబుతున్నా.. పోటీ కారణంగా లెక్కలు మారుతాయనే అంచనాలు ఉన్నాయి. సానాకు ఛాన్స్ లేకుంటే.. ఆ స్థానం లో కిలారు రాజేశ్ కు అవకాశం ఇస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే విధంగా యనమల పేరు రేసులో ఉంది. వర్ల రామయ్య, బాష్యం రామక్రిష్ణ, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ తో సహా పలువురు రాజ్యసభ ఆశిస్తున్నారు. అదే విధంగా తాజాగా మహానాడులో తాము పార్టీ పరంగా 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు అమలు చేస్తామని టీడీపీ ప్రకటించటంతో.. మహిళకు ఛాన్స్ ఉంటుందా అనేది కీలకంగా మారుతోంది. కాగా… బీజేపీకి సీటు ఇవ్వాల్సి వస్తే.. టీడీపీకి రెండు స్థానాలే దక్కుతాయి. దీంతో.. సీట్ల పంపకాలు.. సామాజిక సమీకరణాల లెక్కలతో చివరకు ఎవరకు దక్కుతుందనేది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -