- Advertisement -

అన్నామలై బీజేపీ వీడటం వెనుక.. కొత్త పార్టీ వరకు – ఏం జరిగింది..!

- Advertisement -

తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఆ పార్టీని వీడారు. అన్నామలై రాజీనామాను బీజేపీ ఆమోదించింది. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు అన్నామలై ప్రకటించారు. అయితే.. అన్నామలై బీజేపీని వీడాలని ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదు. దాదాపు 18 నెలల కాలంగా బీజేపీ – అన్నామలై మధ్య విభేదాలు మొదలయ్యాయి. అన్నామలై స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తమిళ నాడులో అన్నామలై కొత్త పార్టీతో ఎవరికి నష్టం.. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారుతోంది.

మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. కొత్త రాజకీయ ఉద్యమం చేయబోతున్నట్లు అన్నామలై తెలిపారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని, తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. మార్పు కోసమే బీజేపీలో చేరానన్నారు. రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. ఇదే సమయంలో అసలు విషయం బయట పెట్టారు. తమిళనాడులో బీజేపీ ఒంటిరిగా పోటీ చేయాలని ఆశించానని.. 18 నెలలుగా బీజేపీతో విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. బీజేపీకి తాను భారంగా ఉండాలనుకోవడం లేదు. అందుకే బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.

2025 డిసెంబర్ నెలలోనే అధిష్ఠానానికి రాజీనామా గురించి చెప్పానని.. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీలో ఉన్నానని వివరించారు. తమిళనాడుకు కొత్త పార్టీ అవసరమని స్పష్టం చేసారు. కల్ట్ రాజకీయాలు వద్దని.. ప్రతీ ఒక్కరితో కరచాలనం చేసే రాజకీయాలు రావాలని ఆకాంక్షించారు. దూరం నుంచి ప్రజలకు అభివాదం చేసే రాజకీయాలకు తాము దూరంగా ఉంటాయని చెప్పారు. అదే విధంగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన అన్నామలై.. అందరినీ కలుపుకొని వెళ్తామని.. సామాన్యులకు తన పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కొత్తగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమయంలో బీజేపీని వీడి అన్నామలై పార్టీ ఏర్పాటు నిర్ణయం ద్వారా ఏ రకమైన మద్దతు వస్తుందనేది ఇప్పుడు రాజకీయంగా కీలక మైన అంశంగా మారుతోంది. దీంతో.. అన్నామలై రాజకీయ భవిష్యత్ ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -