- Advertisement -

జాన్వీ.. అసలు నీకు కట్టాల్సిన బిల్లులు ఏమున్నాయి?

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) చిత్రంలో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ పాత్రను కేవలం గ్లామర్ డాల్‌కే పరిమితం చేశారనే విమర్శలు వస్తున్నాయి. అవసరం లేకపోయినా ఆమె నడుము, నాభి, చాతి, బ్యాక్ సైడ్ భాగాలను కెమెరా యాంగిల్స్ ద్వారా మితిమీరిన శృంగారభరితంగా చూపించారనే నెగెటివ్ టాక్ నడుస్తోంది. నటిని కేవలం ఒక వస్తువులా (Objectifying) చూపించినందుకు దర్శకుడు బుచిబాబు సానాతో పాటు చిత్ర బృందాన్ని నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో పాటు అంతటి స్టార్ హోదా ఉన్న జాన్వీ కపూర్ అసలు ఇలాంటి పాత్రకు ఎందుకు అంగీకరించిందనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఒక పితృస్వామ్య, మహిళా ద్వేషపూరిత తెలుగు సినిమాలో నటించడం ద్వారా జాన్వీ కపూర్ తనకున్న క్రేజ్‌ను, గౌరవాన్ని పూర్తిగా పోగొట్టుకుందని విమర్శించాడు. సమాజంలో ఎంతో ప్రివిలేజ్ ఉన్న ఒక స్టార్ కిడ్ ఇలాంటి పాత్రను ఎలా ఒప్పుకుంటుందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మరో నెటిజన్ మరింత ఘాటుగా స్పందిస్తూ.. మేకర్స్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఒక నెగెటివ్ పోస్ట్‌ను జాన్వీ స్వయంగా లైక్ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డాడు. సినిమాలో నటించమని ఆమెను ఎవరూ బలవంతం చేయలేదని.. కథ మొత్తం చదివి, స్క్రిప్ట్ పై సంతకం చేసిన తర్వాత ఇప్పుడు బాధితురాలిలా (Victim) నాటకాలు ఆడటం సరికాదని విమర్శించాడు. ఆమె కళ్లు మూసుకుని ఆ సీన్లలో నటించలేదు కాబట్టి తప్పులో ఆమెకు కూడా భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశాడు.

ఈ వివాదంపై ఎక్స్ (ట్విట్టర్) లో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో.. “జాన్వీ కపూర్ అసలు నీకు కట్టాల్సిన బిల్లులు ఏమున్నాయి? నువ్వు భారతదేశపు మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురివి. కేవలం నీ చాతి, నాభి, నడుమును మాత్రమే హైలైట్ చేసే ఇలాంటి చెత్త పాత్రలను నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు.” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ విమర్శలపై జాన్వీ కపూర్ అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సినిమాలో ఆమెకు ఉన్న కొన్ని మంచి నటనతో కూడిన సీన్లను.. ఆమెకు తెలియకుండానే ఎడిటింగ్‌లో కట్ చేసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ కేవలం గ్లామర్ పాత్ర అని నమ్మి ఉండవచ్చని.. ఏ సీన్ ఏ యాంగిల్ లో తీయాలో నిర్ణయించేది దర్శకుడే కానీ నటి కాదని డిఫెండ్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా ఇస్తారని.. వృత్తిపరమైన అవకాశాల కోసం, అలాగే రామ్ చరణ్ లాంటి సౌత్ సూపర్ స్టార్‌తో నటించే క్రేజీ ఛాన్స్ రావడం వల్లే జాన్వీ ఈ సినిమాకు సంతకం చేసి ఉండవచ్చని అభిమానులు సమర్థిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -