- Advertisement -

విజయ్ స్థానంలో లారెన్స్‌..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!

- Advertisement -

తమిళ సినీ రంగం నుంచి మరో ప్రముఖ నటుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. వైవిధ్యభరితమైన నటన, దర్శకత్వంతో పాటు తన సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాఘవ లారెన్స్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాఘవ లారెన్స్ పోటీ చేయడం దాదాపు ఖాయమైందని చెన్నై రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తరపున అత్యంత కీలకమైన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి లారెన్స్ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో విజయ్ ఈ స్థానంతో పాటు మరో స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందగా తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

లారెన్స్‌కు ఉన్న సామాజిక సేవా గుర్తింపు, ముఖ్యంగా అనాథ పిల్లలు మరియు వికలాంగుల కోసం ఆయన చేస్తున్న సేవలు ఎన్నికల్లో పార్టీకి భారీగా కలిసివస్తాయని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. విజయ్, లారెన్స్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.

తన రాజకీయ ఎంట్రీ మరియు నియోజకవర్గంపై వస్తున్న ఊహాగానాలకు రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూనే ఈ వార్తలను పూర్తిగా ఖండించలేదు. నా భవిష్యత్ కార్యాచరణ మరియు నా తదుపరి అడుగు గురించి ఈ నెల 11వ తేదీన ఒక కీలక ప్రకటన చేయబోతున్నాను. నా అభిమానులు, మీడియా మిత్రులు మరియు ప్రజలు అప్పటివరకు దయచేసి వేచి చూడాలి అంటూ ట్విస్ట్ ఇచ్చారు లారెన్స్. దీంతో లారెన్స్ చేయబోయే ఆ కీలక ప్రకటన ఏమిటనేది ఇప్పుడు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -