- Advertisement -

కోహ్లీపై వైభవ్ షాకింగ్..వీడియో!

- Advertisement -

తాను ఒకప్పుడు ఆర్‌సీబీ సపోర్టర్ అని ఎప్పటికీ విరాట్ కోహ్లీకి వీరాభిమానినని యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వెల్లడించారు. ఐపీఎల్ సందర్భంగా కోహ్లీ తన భుజంపై చేయి వేసి మాట్లాడటం ఒక కలలా అనిపించిందని రాజస్థాన్ రాయల్స్ (RR) విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.

కోహ్లీ భుజంపై చేయి వేస్తే కలలా అనిపించింది అని చెప్పుకొచ్చాడు వైభవ్. నేను ఆరాధించే వ్యక్తి నా పక్కన నిలబడి మాట్లాడటం నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది అని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో కోహ్లీ తన ఆట గురించి అడిగి తెలుసుకున్నారని…ఆ క్షణాలు తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని వైభవ్ వెల్లడించాడు.

తాను ఒకప్పుడు ఆర్‌సీబీ అభిమాని అయినప్పటికీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టును గెలిపించడమే తన లక్ష్యమని వైభవ్ ఆ వీడియోలో చెప్పగా రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు వైభవ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -