- Advertisement -

30 ఏళ్లకే గుండెపోటు..కారణాలు & జాగ్రత్తలు!

- Advertisement -

ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే పరిమితం అనుకున్న ఈ సమస్య..ఇప్పుడు 30 నుండి 40 ఏళ్ల వయసు వారిని బలితీసుకుంటోంది. మారుతున్న ఆధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు..

()తీవ్రమైన పని ఒత్తిడి

యువ ఉద్యోగులు ఆఫీసుల్లో విపరీతమైన పోటీ, పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఆధునిక విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి పడే ఆర్థిక ఒత్తిడి కూడా తోడవుతోంది. మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో ‘కార్టిసాల్’, ‘అడ్రినలిన్’ వంటి ఒత్తిడి హార్మోన్లు నిరంతరం ఎక్కువగా విడుదలవుతాయి. ఇది రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తుంది.

()కదలిక లేని జీవితం

చాలామంది యువతీ యువకులు వ్యాయామం లేకుండా, రోజుకు 10 నుండి 12 గంటల పాటు ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చునే ఉంటున్నారు. ఈ శారీరక నిష్క్రియాత్మకత గుండె పనితీరును క్రమంగా బలహీనపరుస్తుంది.

() ఫుడ్ డెలివరీ యాప్స్ – జంక్ ఫుడ్..

సమయం లేకపోవడం వల్ల చాలామంది ఫుడ్ డెలివరీ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. ఉప్పు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ‘అల్ట్రా-ప్రాసెస్డ్’ ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో మంట ఏర్పడుతుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియను వేగవంతం చేసి…32 ఏళ్ల వయసులోనే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడేలా చేస్తుంది.

()రక్తనాళాల బ్లాకేజ్ మాత్రమే కాదు, గుండె కొట్టుకునే వేగంలో వచ్చే మార్పులు కూడా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం, రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి కెఫీన్ లేదా ఎనర్జీ డ్రింక్స్‌పై ఎక్కువగా ఆధారపడటం వల్ల గుండె వేగం ఒక్కసారిగా పెరగడం ఏర్పడుతుంది. ఇది రక్తనాళాల్లో ఉన్న చిన్న కొవ్వు గడ్డలను సైతం బద్దలు కొట్టి హఠాత్తుగా గుండెపోటు వచ్చేలా చేస్తుంది.

ఈ ముప్పు నుండి తప్పించుకోవడానికి జీవితాన్ని పూర్తిగా మార్చేయాల్సిన అవసరం లేదు.కొన్ని చిన్న అలవాట్లను పాటిస్తే సరిపోతుంది. ల్యాప్‌టాప్‌లకే అతుక్కుపోకుండా, ప్రతి అరగంటకు ఒకసారి సీటులోంచి లేచి కొన్ని నిమిషాల పాటు అటుఇటు నడవండి.

మీ శరీరంలో కొలెస్ట్రాల్, షుగర్ మరియు రక్తపోటు (BP) స్థాయిలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా సాధారణ రక్త పరీక్షలు చేయించుకోండి.
సరైన, ప్రశాంతమైన నిద్ర శరీరంలో ఒత్తిడి హార్మోన్లను తగ్గించి గుండెను రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -