- Advertisement -

దిగొచ్చిన దీదీ..కూటమి సమావేశానికి!

- Advertisement -

పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం మమతా బెనర్జీ తన మనసు మార్చుకున్నారు. ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీకి పయనమయ్యారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన బలమైన విజయం వల్ల టీఎంసీలో అంతర్గత ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది.

కోల్‌కతా విమానాశ్రయం నుండి మమతతో పాటు పార్టీ సీనియర్ నేతలు డోలా సేన్, కల్యాణ్ బెనర్జీ కూడా వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ సమాచారం ప్రకారం ఈ సమావేశంలో పాల్గొనేందుకు 23 రాజకీయ పార్టీలు తమ సమ్మతిని తెలిపాయి. టీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు గట్టి ఎదురుదెబ్బలు తినగా..వివిధ రాష్ట్రాల్లో కూటమి నేతల మధ్య అంతర్గత విభేదాలు కూడా బయటపడ్డాయి.

తమిళనాడు ఎన్నికల తర్వాత నటుడు విజయ్‌కి చెందిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలపడంపై డీఎంకే తీవ్ర అసంతృప్తితో ఉంది. అందుకే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని డీఎంకే నిర్ణయించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై సీపీఐ(ఎం) అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ తమ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను ఈ సమావేశానికి పంపుతోంది.

భాగస్వామ్య పక్షాల మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించి..భవిష్యత్ రాజకీయ పోరాటాల్లో బీజేపీని సంయుక్తంగా ఎదుర్కొనేందుకు పరస్పర సమన్వయాన్ని, తమ నిబద్ధతను బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రాబోయే ఎన్నికల కోసం స్పష్టమైన నాయకత్వ నిర్మాణాన్ని…భాగస్వామ్య పక్షాల మధ్య మెరుగైన సమన్వయాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారు. నిర్ణయాధికారాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత కోరుతుండటంతో, వ్యూహాలను సరళీకృతం చేసి బలమైన విపక్షాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -