- Advertisement -

జనసేన నేతలు..అనాథలు!

- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. మీడియాతో మాట్లాడిన నాని.. సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో చూడండి..పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవితో పాటు సంస్కారం కొత్తగా వచ్చిందా..? చెప్పాలన్నారు. అప్పుడు కాదు.. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా.. ఏం చేశావ్..?… మేమంతా పవన్ కళ్యాణ్ కొడుకులమా..? …పవన్ కళ్యాణ్ మాట్లాడింది సంస్కారవంతమైన భాషా..? అంటూ గతంలో పవన్ మాట్లాడిన వీడియో చూపించారు.

పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని ఆ విషయాన్ని వాడుకున్నాడు..అలాగే మా హొంమంత్రి అనితమ్మను అమాయకురాలిని చేసి పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు వాడుకుంటున్నారు…అసలు హోంమంత్రి కట్టుబొట్టు గురించి ఎవరూ మాట్లాడారు..? చెప్పాలన్నారు.

లోకేష్ నాయుడు మీ అమ్మగారు ఒక్కరే స్త్రీ..మా నాయకుడు జగన్ గారి భార్య, పిల్లలు గురించి లోకేష్ నాయుడు మాట్లాడాడు..జగన్ గారి భార్యాపిల్లలు ఏరోజు అయినా మీ ఊసు ఎత్తారా..? రాజకీయాల గురించి మాట్లాడారా..?… అవి ఏ బ్రాండ్ బిస్కెట్లో కానీ, అద్భుతంగా పనిచేస్తున్నావయ్యా.. ఆల్ వన్స్ పప్పీ అంటూ ఎద్దేవా చేశారు.

జ‌న‌సేన వాళ్లు అనాథ పిల్ల‌లు.. తెలుగుదేశం వాళ్లు చేసేస్తారు అంతే..ఏపీలో జ‌న‌సైనికుల గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌న‌ప‌డ‌దు.. విన‌ప‌డ‌దు…రాజా దిగ్రేట్ సినిమాలో ‘ఏమోసార్‌.. నాకు క‌న‌ప‌డ‌దు’ డైలాగులా త‌యారైంది ప‌రిస్థితి అని చురకలు అంటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -