సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సంక్రాంతి 2027’ లక్ష్యంగా ఈ సినిమా ప్లానింగ్ జరుగుతోంది.
ఈ భారీ చిత్రం రేపు (జూన్ 18) ఘనంగా ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు అనిల్ రావిపూడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ లేదా నవంబర్ నాటికల్లా షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా జనవరి 13న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. వెంకటేష్ జూలై నుండి విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొననున్నారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటించనున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడు ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పక్కా స్క్రిప్ట్, ప్లానింగ్‌తో వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి, ఈ మల్టీస్టారర్ మూవీతో మరో హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
