టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత త్వరలో తల్లి కాబోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ వేడుకల్లో ఆమె బేబీ బంప్‌తో కనిపించడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
సమంత నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత పాల్గొనగా, ఆమెలో కనిపిస్తున్న మార్పులను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు మూవీ ప్రమోషన్స్‌లో చీరకట్టులో కనిపించి ఈ విషయాన్ని దాచిన సమంత, తాజాగా ధరించిన దుస్తుల్లో బేబీ బంప్‌తో స్పష్టంగా కనిపించారు. దీంతో ఆమె గర్భవతి అనే వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ విషయంపై సమంత కానీ, ఆమె భర్త దర్శకుడు రాజ్ నిడిమోరు కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు గతేడాది ఈశా యోగా కేంద్రంలో జరిగిన భూతశుద్ధి వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్-2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌ల చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం వివాహానికి దారితీసింది.
రాజ్ నిడిమోరు కథ అందించగా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని సమంత సొంతంగా నిర్మించారు. ఈ సినిమా తొలి రోజునే రూ.13.15 కోట్ల వసూళ్లను సాధించి, సమంతకు నటిగా, నిర్మాతగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు వృత్తిపరంగా సక్సెస్‌లో ఉన్న సమంత, వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త దశకు చేరుకుంటున్నారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
