- Advertisement -

మహిళల డ్రెస్సింగ్‌పై సునీత సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

​మహిళల దుస్తుల ఎంపిక, వ్యక్తిగత స్వేచ్ఛపై సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మహిళల డ్రెస్సింగ్‌పై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలను వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.

​మహిళల డ్రెస్సింగ్ ఫ్రీడమ్ అంశంపై ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో సింగర్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా మహిళలు “నా బాడీ.. నా ఇష్టం” అని వాదిస్తుంటారు. దీనిపై స్పందించిన సునీత, “అది నీ ఇష్టమైతే, చూసే వాడి కళ్లు వాడి ఇష్టం కదా.” అని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో అది సరైన స్వేచ్ఛ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

​స్త్రీలు ఏ దుస్తులు వేసుకోవాలి అనేది ఎదుటివారు నిర్ణయించడం తమ స్వేచ్ఛను అడ్డుకోవడమేనని గత కొంతకాలంగా చాలామంది మహిళలు వాదిస్తున్న నేపథ్యంలో, సునీత చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. ఒకే ఏ దుస్తులైనా వేసుకునే హక్కు మహిళలకు ఉందని కొందరు వాదిస్తుంటే, సునీత చేసిన వ్యాఖ్యలు సరైనవేనని మరికొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఈ చర్చతో పాటు సినిమా రంగంలో మహిళల పరిస్థితిపై కూడా సునీత ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా పరిశ్రమ మహిళలకు అంత సురక్షితమైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా మరియు ఫైనాన్షియల్‌గా ఎవరైతే బలంగా ఉండరో, అటువంటి మహిళలను ఇండస్ట్రీ ప్రతిక్షణం పరీక్ష పెడుతుందని ఆమె స్పష్టం చేశారు.

​మొత్తానికి మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సినిమా పరిశ్రమలోని పని పరిస్థితులపై సునీత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయమై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -