- Advertisement -

పవన్ కల్యాణ్ ఒక ‘సైడ్ క్యారెక్టర్’!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సైడ్ క్యారెక్టర్ అన్నారు మాజీ సీఎం, వైసీపీ నేత జగన్. బుధవారం నాటి మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్.. పవన్ కల్యాణ్‌ను ఒక ‘సైడ్ క్యారెక్టర్’ గా జగన్ అభివర్ణించారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదని.. ఆయనకు సొంతంగా ఎటువంటి రాజకీయ సిద్ధాంతాలు లేవని, కేవలం చంద్రబాబుకు ఒక భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయారనే కోణంలో జగన్ వ్యాఖ్యానించారు.

దీని తర్వాత, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై మాజీ సీఎం మరో బలమైన వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందని…రాష్ట్రంలో ‘జంగిల్ రాజ్’ నడుస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ సీనియర్ ఎన్టీఆర్ పేరును కూడా చర్చలోకి తీసుకువచ్చారు. ఈరోజు గనుక సీనియర్ ఎన్టీఆర్ బతికి ఉండి, చంద్రబాబు అరాచక పాలనను ప్రశ్నిస్తే.. ఆయనను కూడా చంద్రబాబు ‘రౌడీ షీటర్’ అని ముద్ర వేసేవారు. చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా వారిపై రౌడీలనే ముద్ర వేస్తారు అని ధ్వజమెత్తారు.

తనకు అమరావతి ప్రాంతంపై ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే అక్కడ ఉన్న స్థానిక రైతులకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని పేర్కొంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -