- Advertisement -

భార్య, కుమార్తెను హత్య చేసి..

- Advertisement -

తమిళనాడులోని ధర్మపురిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణానికి ఒడిగట్టాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తన భార్యను, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తెను కిరాతకంగా హత్య చేసి, ఆ తర్వాత తాను కూడా లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ధర్మపురి జిల్లా కోట్టైకోవిల్ ప్రాంతానికి చెందిన డీఎంకే నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్ (45) తన భార్య శరణ్య (36), కుమార్తె సాత్విక (14)తో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం పాఠశాల సమయం ముగియకముందే కుమార్తె సాత్వికను సంతోష్ ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఇంట్లోనే భార్య శరణ్య గొంతు నులిమి చంపాడు. అనంతరం కుమార్తె సాత్విక తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు.

వెంటనే సంతోష్ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్ళిపోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈలోగా సేలం-ధర్మపురి జాతీయ రహదారిపై ఒక వ్యక్తి లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, మరణించిన వ్యక్తి సంతోష్‌గా నిర్ధారించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధానంగా వ్యాపారంలో ఎదురైన నష్టాలే ఈ ఘాతుకానికి కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. సంతోష్ తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్టైకోవిల్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -