- Advertisement -

‘జైలర్‌ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోగా, ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు అక్టోబరు 15న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు సన్‌ పిక్చర్స్ ఒక ప్రత్యేక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు పలువురు అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో నటిస్తుండటం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ‘జైలర్’ సాధించిన సక్సెస్‌ను ఈ సీక్వెల్ కూడా పునరావృతం చేస్తుందని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘జైలర్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అనిరుధ్ సంగీతం, రజనీకాంత్ స్టైలిష్ యాక్షన్, నెల్సన్ టేకింగ్‌తో ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్‌ 2’పై కూడా అదే స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -