- Advertisement -

పొలిటికల్ ఎంట్రీ.. అభిమానులకు ధనుష్ పిలుపు

- Advertisement -

తమిళ సినీ ఇండస్ట్రీలో మరో స్టార్ హీరో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ ఇటీవల అభిమానులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగాగాలకు మరింత బలం చేకూర్చాయి.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ప్రస్తుతం తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ధనుష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభిమానులు కేవలం సినిమా వేడుకలు, ఫ్యాన్స్ మీట్లకే పరిమితం కాకుండా, స్థానికంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘‘ఇంతమంది ఒకే చోట సమావేశం కావడమనేది చిన్న విషయం కాదు. ఈ ఐక్యతలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి మనం ఒక మంచి లక్ష్యాన్ని అందించాలి’’ అని ధనుష్ పేర్కొన్నారు. మీ ప్రాంతాల్లోని ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, మీకు సాధ్యమైనంతగా సహాయం చేయాలని, మిమ్మల్ని చూసి తాను గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కోరారు. దళపతి విజయ్ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసి ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీని స్థాపించిన నేపథ్యంలో, ధనుష్ కూడా అదే బాటలో రాజకీయాల్లోకి వస్తున్నారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఈ సమావేశంలో తన తాజా చిత్రం ‘రాయన్‌’కు నేషనల్ అవార్డు రావడంపై వస్తున్న విమర్శలపైనా ధనుష్ స్పందించారు. ఆ ఏడాది ‘రాయన్’ కంటే మెరుగైన సినిమాలు వచ్చాయన్న ప్రేక్షకుల అభిప్రాయాన్ని తాను పూర్తిగా గౌరవిస్తానని తెలిపారు. విమర్శలను పక్కనపెట్టి ఈ విజయాన్ని ఆస్వాదించాలని సూచించారు. గతంలో తాను ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసినప్పటికీ అవార్డులు రాలేదని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ‘వడా చెన్నై’, ‘కర్ణన్’, ‘మరియాన్’ వంటి సినిమాల గురించి పది శాతం మంది కూడా మాట్లాడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాలతో పాటు రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -