- Advertisement -
అంతర్జాతీయ స్థాయిలో వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ యంగ్ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు.
కష్టపడి పనిచేసే తత్వంతో, పట్టుదలతో అజయ్ సాధించిన ఈ విజయం రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణమని వైఎస్ జగన్ కొనియాడారు. భవిష్యత్తులో అజయ్ మరిన్ని అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున ప్రతిభ చాటి, అత్యున్నత శిఖరాలను రోహించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే క్రీడాకారులకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తే వారు దేశానికి మరిన్ని పతకాలు తీసుకువస్తారని పేర్కొన్నారు.
