- Advertisement -

రాయలసీమ నీటి హక్కుల కోసం వైసీపీ ఉద్యమం

- Advertisement -

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం జరుగుతున్న పోరాటం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, ఇది లక్షలాది మంది రైతుల జీవన హక్కుల కోసం సాగుతున్న మహా ఉద్యమమని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యానించారు. కరువు నేలగా మారిన రాయలసీమను పచ్చని పంటల సీమగా మార్చే దివ్యౌషధం ఒక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకే ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులపై చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా సి.కె.పల్లి మండలం న్యామద్దల గ్రామం నుండి హంద్రీనీవా కాలువ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఉషశ్రీ చరణ్ నాయకత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, రైతులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రాయలసీమకు కృష్ణా జలాలు అందించారని ఆ తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను దాదాపు 80 శాతం పూర్తి చేసిందని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమలో నీటి కొరత శాశ్వతంగా తీరిపోయేదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రంతో కుమ్మక్కై ఈ ప్రాజెక్టును పక్కనబెట్టారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆల్మట్టి అల్టిమేటం, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలపై చంద్రబాబు మౌనం వహిస్తూ రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

హంద్రీనీవా కాలువల లైనింగ్ పనుల్లో తీవ్ర అవినీతి, నాసిరకం నిర్మాణాలు జరిగాయని దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన కాంట్రాక్టర్ల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలు ఇక మోసపోవడానికి సిద్ధంగా లేరని తమ నీటి హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాయలసీమకు సాగునీటి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ రైతుల తరఫున క్షేత్రస్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -