- Advertisement -

జగన్‌ రాకతో పోటెత్తిన ఉత్తరాంధ్ర.. ఆంక్షలు చేధించి

- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం పర్యటన వేళ జనసంద్రం పోటెత్తింది. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పరామర్శ కోసం జగన్ శ్రీకాకుళం వెళ్తారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకునేందుకు బయల్దేరిన జగన్ కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం వరకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. జగన్ ను చూసేందుకు మహిళలు పోటీ పడ్డారు. దాదాపు ఆరు గంటల పాటు జగన్ జనయాత్ర కొనసాగింది.

జగన్‌ ఉత్తరాంధ్ర పర్యటనకు అపూర్వ ప్రజాదరణ లభిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు రోడ్డు మార్గంలో కొనసాగుతున్న ఆయన పర్యటనలో దారి పొడవునా వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఘన స్వాగతం పలుకుతున్నారు. తగరపువలస దాటి సంగివలస చేరుకున్న వైఎస్‌ జగన్‌కు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారిని జగన్‌ ఎత్తుకుని ఆప్యాయంగా ముద్దాడారు. ఆ దృశ్యం అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. ప్రజలకు చేతులెత్తి అభివాదం చేస్తూ, అభిమానుల అభివాదాలకు ప్రతిస్పందిస్తూ జగన్‌ ముందుకు సాగారు.

విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు కనిపిస్తున్న అపూర్వ జనస్పందన ఉత్తరాంధ్ర ప్రజల్లో వైఎస్‌ జగన్‌పై ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచిందని వైసీపీ పేర్కొంది. కాగా, ఆగస్టు 1న ప్రారంభం కానున్న భోగాపురంలో విమానాశ్రయం కోసం వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన అనుమతులు.. పురోగతి గురించి జగన్ వివరించారు. దీంతో.. భోగాపురం వద్ద జగన్ చేరుకోగానే పెద్ద సంఖ్యలో స్థానికులు జగన్ కోసం తరలి వచ్చారు. విమానాశ్రయం రావటంతో థాంక్యూ జగన్ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. జగన్ పర్యటన సమయంలో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. అయినా, వాటిని ఛేదించుకొని జగన్ కోసం అభిమానులు.. స్థానికులు తరలి రావటంతో విశాఖ- శ్రీకాకుళం రహదారి మొత్తం జనసంద్రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -