- Advertisement -

టీమిండియా ‘ట్రబుల్ షూటర్’..అద్భుత ప్రస్థానం!

- Advertisement -

క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన అత్యుత్తమ ఆటగాళ్లలో కొందరు తమ ఆటతో ఒక నిశ్చితత్వాన్ని తీసుకువచ్చారు. వారు చేసిన ప్రతి పరుగు, కొట్టిన ప్రతి బౌండరీ వారి కీర్తి ప్రతిష్టలను పెంచుతూ వచ్చాయి. ఒకవేళ ఫామ్ కోల్పోయినా, అవి కేవలం తాత్కాలిక లోపాలు మాత్రమేననే వెసులుబాటు వారికి ఉండేది. వివిధ యుగాల్లోని గొప్ప భారతీయ టెస్ట్ జట్లలో అలాంటి పాత్రలు ఉన్నారు — వారు అత్యున్నత స్థాయి గౌరవాన్ని, ఏ పరిస్థితిలోనైనా మారని మద్దతును పొందారు. అయితే, దాదాపు పదేళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో సాధించిన విజయాలన్నీ ఉన్నప్పటికీ, అజింక్య రహానేకు అలాంటి వెసులుబాట్లు ఎప్పుడూ లభించలేదేమో.

రహానే భారత బ్యాటింగ్‌కు ప్రధాన ఆధారం కాకపోవచ్చు కానీ విదేశీ పిచ్‌లపై భారత్‌కు అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా నిలిచిన సమయం ఒకటుంది. కెప్టెన్ అందుబాటులో లేనంత వరకు ఆయన ఎప్పుడూ పూర్తిస్థాయి కెప్టెన్ కాలేదు. భారత జట్టు తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు రహానే ఆడిన ఇన్నింగ్స్‌ల ద్వారా ఆయన కెరీర్‌ను విశ్లేషించవచ్చు.

మిడిల్ ఆర్డర్ విఫలమైన ప్రతిసారీ ఆయనో ‘SOS’ అత్యవసర పిలుపులా మారేవాడు. 2014 నాటి లార్డ్స్ టెస్టును ఒకసారి గుర్తుచేసుకోండి. ఇషాంత్ శర్మ వేసిన బౌన్సర్ల తుఫాన్ దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అయిపోగా భారత్ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. కానీ ఆ ఐదవ రోజు అద్భుతం జరగడానికి చాలా ముందే.. మొదటి రోజు జట్టు 145/7తో తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు రహానే ఒక వేగవంతమైన, కౌంటర్-ఎటాకింగ్ సెంచరీతో పునాది వేశాడు. తన సహచరుడి కెరీర్ డిఫైనింగ్ మూమెంట్‌లో రహానే అందించిన అత్యంత ముఖ్యమైన సహకారం ఇది. తీవ్ర శ్రమకు ప్రాధాన్యతనిస్తూ, క్రెడిట్ కోసం తాపత్రయపడని ఆయన కెరీర్‌కు ఇది సరైన ఉదాహరణ.

అయినప్పటికీ భారత క్రికెట్ ఎప్పుడు ఆత్మరక్షణలో పడినా, చూపులు ఎల్లప్పుడూ ఆయన వైపే మళ్లేవి. ఆయనో అద్భుతమైన టెస్ట్ బ్యాటర్ అని మాత్రమే కాదు.. క్లిష్ట సమయాల్లో జట్టును ఒడ్డుకు చేరుస్తాడనే నమ్మకం ఆయనపై ఉండేది. అయితే క్రికెట్‌లో ఈ ‘నమ్మకం’ అనేది ఒక విచిత్రమైన కరెన్సీ. ఇది స్కోర్‌బోర్డ్‌పై ఎల్లప్పుడూ కనిపించకపోవచ్చు. కానీ లార్డ్స్ నుండి మెల్‌బోర్న్ వరకు మరియు ప్రతిచోటా ఆయన ఆ నమ్మకాన్ని ఒక గౌరవ పతకంలా మోశాడు.

లార్డ్స్ సెంచరీ తర్వాత ఆరేళ్లకు అంతకంటే ఎక్కువ బరువును భుజాలపై మోస్తూ ఆయన మెల్‌బోర్న్‌లో అడుగుపెట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయి భారత్ ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకున్న వారం రోజుల తర్వాత ఆయన తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. జట్టులో మళ్లీ నమ్మకాన్ని నింపి పాతాళానికి పడిపోయిన స్థితి నుండి బయటకు తీసుకురావడంలో ఆయన ముందుండి నడిచాడు.

ఇది రహానే యొక్క ఉక్కు లాంటి మనస్తత్వాన్ని ప్రతిబింబించింది. జట్టు అవసరాలకు తగ్గట్టుగా తన స్వభావాన్ని మార్చుకునే నైపుణ్యం ఆయనకు ఉండేది. జట్టు అడిగినప్పుడు ఎదురుదాడి చేశాడు, మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు అడ్డుగోడలా నిలిచాడు. అనుకోకుండా నాయకత్వ బాధ్యతలు వచ్చినా తన శైలిని మార్చుకోకుండా నడిపించాడు. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆయన కెప్టెన్సీ ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా సాగడం వల్లే ప్రత్యేకంగా నిలిచింది. ఆయన చూపిపిన ఆ స్ఫూర్తినే జట్టు గబ్బాలో ప్రతిబింబించింది. ఆయనలాగే అన్ని అడ్డంకులను అధిగమించి ఆస్ట్రేలియా ఉక్కుకోటను బద్దలు కొట్టింది.

హోమ్‌ గ్రౌండ్‌లలో భారత్‌కు భారీ మ్యాచ్ విన్నర్లు ఉన్న యుగంలో రహానే ఆడాడు. అయినప్పటికీ ఆయన కూడా తేడా చూపించిన సందర్భాలు ఉన్నాయి. 2015 ఢిల్లీ టెస్టులో, మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్‌పై దక్షిణాఫ్రికా పట్టు సాధిస్తుందనుకున్న సమయంలో రహానే ఒక పోరాట పటిమతో కూడిన సెంచరీ సాధించి దాన్ని లాక్కున్నాడు. అదే గేమ్‌లో వారు మళ్లీ ముందంజ వేసేందుకు ప్రయత్నించగా రహానే మరో సెంచరీ బాదాడు. ఒక సంవత్సరం తర్వాత ఇండోర్‌లో న్యూజిలాండ్‌పై తన అత్యధిక టెస్ట్ స్కోరు 188 పరుగులు చేశాడు.

తన కెరీర్‌లో ఎక్కువసార్లు రహానే సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే రాణించాడు. పోరాడాల్సిన అవసరమే ఆయనలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసింది. అయితే సాంకేతిక లోపాలు ముఖ్యంగా ఆఫ్-స్టంప్ వెలుపల ఆడేటప్పుడు ఆయన బలహీనతలు బయటపడటం ప్రారంభమయ్యాయి. కెరీర్ చివరి దశలో ఏకాగ్రత లోపించడం మరొక సమస్యగా మారింది. 2021లో ఆయన ప్రదర్శన పడిపోవడం స్పష్టంగా కనిపించింది.

2022 ప్రారంభంలో నిలకడలేని ఫామ్ కారణంగా రహానేను పక్కన పెట్టింది. రహానే ఒక అడుగు వెనక్కి తగ్గి రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 57.64 సగటుతో 634 పరుగులు చేసి బీసీసీఐ తన వైపు మళ్లీ చూసేలా చేశాడు. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ల గాయాల వల్ల అవకాశం వచ్చినా ఆయన WTC ఫైనల్ కోసం జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆ ఫైనల్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసి పెద్ద స్కోర్లు సాధించే సత్తా తనకు ఇంకా ఉందో లేదో చూపెట్టాడు. ఆ తర్వాత జూలైలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లినప్పటికీ అక్కడ తక్కువ పరుగుల వల్ల సెలక్టర్లు ఆయనను పూర్తిగా పక్కన పెట్టక తప్పలేదు.

చివరికి టీ20 ఫార్మాట్‌లో కూడా, ఆయన పని అయిపోయిందని అందరూ భావించిన చోట, రహానే తన ప్రాముఖ్యతను నిలుపుకోవడానికి మరొక మార్గాన్ని కనుగొన్నాడు. 2008 నాటి ప్రారంభ ఐపీఎల్ సీజన్ నుండి ఆడి, 2010లో మాత్రమే ఒక సీజన్ మిస్ అయిన పాత తరం ఆటగాడిగా, విపరీతమైన స్ట్రైక్ రేట్లతో సాగుతున్న ఈ శకంలో ఆయన వెనుకబడిపోతాడని భావించారు. RR తో ట్రేడ్ డీల్ ద్వారా వచ్చిన తర్వాత ఆయన 2021 సీజన్‌లో ఎక్కువ భాగం DC బెంచ్ మీదే గడిపాడు. ఒక సీజన్ తర్వాత ఆయన KKR తరఫున సగం మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఆ తర్వాత CSK వద్ద పరిస్థితిని తిరగరాశాడు, అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 2023లో టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో—ఈసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మళ్లీ పరుగుల వరద పారించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -