ఏపీలో రైలు ప్రయాణీకులకు బిగ్ న్యూస్. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న వందేభారత్ స్లీపర్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటికే గౌహతి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ నడుస్తోంది. ముంబాయి నుంచి ఏపీ మీదుగా బెంగళూరు వరకు వందేభారత్ రెండో స్లీపర్ పట్టాలెక్కించేందుకు సిద్దమైంది. ఏపీలో నడుస్తున్న వందేభారత్ రైళ్లకు ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోంది. ఈ క్రమంలో విశాఖ నుంచి బెంగళూరు వరకు వందే భారత్ స్లీపర్ కు ఆమోదం లభించింది. ఈ రైలు రూటుతో పాటుగా షెడ్యూల్ ప్రకటించారు.
వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రకటన పైన కసరత్తు జరుగుతోంది. తక్షణం డిమాండ్ ఉన్న మార్గాల పైన అన్ని జోన్ల నుంచి వచ్చిన రిక్వెస్టు లను పరిశీలించారు. కోసం కొంత కాలంగా కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం డిమాండ్ ఉన్న పలు మార్గాలను పరిశీలన చేసారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు తరువాత విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ పైన నివేదికలు అందాయి.నివే అయితే, విశాఖ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ ఖరారు చేసారు. ఈ రైలుకు సంబంధించిన రూట్.. షెడ్యూల్ పైన పరిధిలోని డీఆర్ఎం లకు కోస్తా జోన్ అధికారుల నుంచి నివేదికలు కోరారు. ఈ రూట్ లో హాల్టింగ్ స్టేషన్లు.. షెడ్యూల్ డివిజనల్ కార్యాలయాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఖరారు చేసారు. అక్టోబర్ లో ఈ రైలు ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ రైలు నిర్వహణ షెడ్యూల్ ఖరారైంది. విశాఖ నుంచి రాత్రి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి దువ్వాడకు 8.45కు, కృష్ణాకెనాల్‌కు అర్ధరాత్రి 1.05కు, నంద్యాలకు తెల్లవారుజామున 4.40కి, ధర్మవరానికి 7.30కి, బెంగళూరుకు ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో బెంగళూరులో రాత్రి 8 గంటలకు బయలుదేరి ధర్మవరానికి 10.30కి, నంద్యాలకు అర్ధరాత్రి 1.02కి, కృష్ణాకెనాల్‌కు తెల్లవారుజాము 4.55కు, దువ్వాడకు 9.15కు, విశాఖపట్నానికి ఉదయం 10 గంటలకు వస్తుంది’ అంటున్నారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు నడుస్తున్న రైళ్లలో వెళ్లాంటే ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోంది. కాగా, ఈ వందేభారత్ స్లీపర్ రైలులో 14 గంటల వ్యవధిలోనే చేరుకునే అవకాశం కలగనుంది. దీంతో.. ఈ రైలు పైన అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
