- Advertisement -

అరుణాచలం వచ్చే భక్తులకు కొత్త నిబంధనలు.. మోక్ష మార్గంలో వారికే అనుమతి..

- Advertisement -

లక్షలాది మంది భక్తులు నిత్యం దర్శనం కోసం వచ్చే పవిత్ర ప్రదేశం అరుణాచలం. గిరిప్రదిక్షణ.. మోక్ష మార్గం ఇక్కడ చాలా పవిత్రంగా భావిస్తారు. నిత్యం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ కు తరలి వెళ్తారు. కాగా.. ఇక్కడ కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఘటనలతో ఆలయ అధికారులు కొత్తగా నిర్ణయాలు ప్రకటించారు. నిబంధనలు విధించారు. మోక్ష మార్గంలోకి వెళ్లేవారి విషయంలోనూ పరిమితులు ప్రకటించారు.

అరుణాచలం ఆలయానికి పెద్ద సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం తరలి వస్తారు. పౌర్ణమి రోజున మరింతగా రద్దీ కనిపిస్తోంది. అదే సమయంలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు.. మోక్షమార్గం ను భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గుహా ఆకారంలో ఈ మోక్ష మార్గంలో గుహ ఆకారంలో ఉండే ఈ చిన్న ఆలయంలో భక్తులు వెనుక ద్వారం గుండా పడుకుని లోపలికి ప్రవేశించి, ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం ద్వారా బయటకు రావడం ఆనవాయితీ. బయటకు వచ్చాక అక్కడే ఉన్న నందిని, ఇడుక్కు పిల్లయ్యార్‌ను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అయితే, తాజాగా ఏపీకి చెందిన ఒక భక్తుడు ఈ మోక్ష మార్గంలోకి వెళ్లి మధ్యలోనే ఇరుక్కుపోయారు. కాసేపటికే మృతి చెందారు. దీంతో.. ఆలయ అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు.

అదే విధంగా మేరకు మోక్షమార్గంలో ప్రవేశానికి నిర్దిష్ట సమయాలకు మాత్రమే పరిమితం చేశారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు.. అలాగే సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. రద్దీ నియంత్రణ లో భాగంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను లోపలికి పంపుతున్నారు. ఇందుకు కోసం ఆ ప్రదేశంలో గ్రిల్ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక ఇనుప గ్రిల్ ను ఏర్పాటు చేశారు. దీనిని మోక్షమార్గం సైజుకు సమానంగా ఉండేలా తయారు చేశారు. ఈ గేటు ద్వారా లోపలకు వెళ్లగలిగిన వారినే ఆలయంలో ప్రస్తుతం ఉన్న మోక్షమార్గంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -