- Advertisement -

యాక్సిడెంట్‌లో భర్తను చంపాలంటూ ప్రియుడికి భార్య..

- Advertisement -

భార్య అంటే జీవితాంతం తోడుండాల్సిన అర్ధాంగి. కానీ, అదే భర్త తనకు అడ్డుగా మారాడనో ఏమో కానీ.. కట్టుకున్నవాడినే కడతేర్చేందుకు ఓ భార్య పన్నిన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్తను రోడ్డు ప్రమాదంలో చంపించాలని, లేకపోతే తాను బతకలేనంటూ ప్రియుడికి ఆమె పంపిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను చూసి ఖాకీలు సైతం కంగుతిన్నారు. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో కలకలం రేపిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు.. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిప్రభాత్‌నగర్‌లో కిరాయి ఇంట్లోంటూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2016లో సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన యువతి భవానితో వివాహం కాగా, ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇదిలా ఉండగా, గత నెల 27న మధ్యాహ్నం భోజనం కోసం రాజేశ్వరరావు ఇంటికి వెళ్లగా.. అక్కడ భార్య భవాని మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని స్వయంగా కంటపడ్డారు.

దీంతో ఆమె ప్రవర్తనపై తీవ్ర అనుమానం వ్యక్తంచేసిన రాజేశ్వరరావు.. గత నెల 28న చిలుకోడులో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో చిలుకోడు సమీపంలోని తాళ్లసంకేస గ్రామంలో ఉన్న తన అన్న గాదే శ్రీనివాస్‌ను పిలుచుకొచ్చేందుకు వెళ్తుండగా, తన భార్యతో చనువుగా ఉన్న వ్యక్తి తన వెనుకనే బైక్‌పై వెంబడించడాన్ని గుర్తించాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను పరారయ్యాడు. ఆ తర్వాత చిలుకోడు చేరుకున్న భర్త.. భార్య భవాని సెల్‌ఫోన్‌ను పరిశీలించగా గుండెలు గుభిల్లుమనే నిజాలు బయటపడ్డాయి.

భర్తను అడ్డుతొలగించుకునేందుకు భవాని.. కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్న తన ప్రియుడు పురిమెట్ల సైదులుతో కలిసి భారీ కుట్ర పన్నినట్లు చాటింగ్ ద్వారా తేలింది. ‘‘ఇంట్లో మాత్రం చంపొద్దు.. బయట ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించి చంపించు, లేదంటే నేను చనిపోతాను’’ అంటూ ఆమె ప్రియుడికి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన మెసేజ్‌లను చూసి రాజేశ్వరరావు విస్తుపోయాడు. ఆ చాటింగ్ నకలు ప్రతులను భర్త పోలీసులకు అందజేశాడు.

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో తనను హత్య చేసేందుకు కుట్రపన్నిన భార్య భవాని, ఆమె ప్రియుడు పురిమెట్ల సైదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజేశ్వరరావు ఈ నెల 1న డోర్నకల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితుడు గురువారం గ్రామీణ ఠాణాలో మరోమారు ఫిర్యాదు చేయగా, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి కేసు నమోదు చేస్తామని ఖమ్మం గ్రామీణ సీఐ ముష్కరాజు తెలిపారు. ప్రియుడి కోసం కట్టుకున్నోడినే పొట్టనబెట్టుకోవాలని చూసిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -