- Advertisement -

విద్యార్థులు, టీచర్లపై స్టూడెంట్ కాల్పులు.. ఏడుగురు మృతి!

- Advertisement -

థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నొంతగురి ప్రావిన్స్‌లోని బాంగ్‌ క్రువాయ్‌ జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మక ‘డెబ్సిరిన్ స్కూల్’ (Debsirin School) ప్రాంగణంలో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అనే కనికరం లేకుండా విచక్షణారహితంగా జరిపిన ఈ కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థి చివరకు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ భయానక ఘటనపై థాయ్ ఉప ప్రధాని అనుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యవసరంగా మెరుగైన వైద్యం అందించాలని, ఈ దాడులకు గల అసలు కారణాలను కూపీ లాగాలని అధికారులను ఆయన ఆదేశించారు.

పోలీసులు మరియు ప్రజారోగ్య మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఘాతుకానికి పాల్పడిన విద్యార్థి స్కూల్‌కు బయలుదేరే ముందే తన ఇంట్లో దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లోనే తన స్వంత బామ్మ, తాతలను అత్యంత దారుణంగా కాల్చి చంపినట్లు తేలింది. ఆ తర్వాత అదే తుపాకీతో నేరుగా స్కూల్‌కు చేరుకుని ఈ మారణహోమానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు ఉపయోగించిన 9 ఎంఎం హ్యాండ్‌గన్ సదరు విద్యార్థి తాతకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. విశేషమేమిటంటే, కాల్పులకు పాల్పడిన విద్యార్థి తాత గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు అధికారులు తెలిపారు.

ఇంటి వద్దే కుటుంబ సభ్యులను హతమార్చి, ఆపై విద్యా సంస్థలోకి ప్రవేశించి సామూహిక కాల్పులకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చిన్నారులు, ఉపాధ్యాయుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంపై అంతర్జాతీయ స్థాయిలోనూ విచారం వ్యక్తమవుతోంది. పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలు, విద్యార్థుల మానసిక పరిస్థితిపై మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -