- Advertisement -

యశ్ ‘టాక్సిక్’.. అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!

- Advertisement -

కన్నడ స్టార్ హీరో యశ్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic). టాలెంటెడ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మొదటి రోజు టికెట్ల అమ్మకాల్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ఆగస్టు 21న ప్రారంభమైన ఈ అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో భారీ స్పందన లభిస్తోంది. సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తొలి రోజు కోసం భారత్‌లో డైరెక్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రూ.21.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13,591 షోలకు గాను దాదాపు 5.55 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

ఇక హోల్డ్‌లో ఉంచిన సీట్లతో కలిపి చూస్తే ఈ వసూళ్లు ఏకంగా రూ.30.14 కోట్లు దాటాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా యశ్ సొంత రాష్ట్రమైన కర్ణాటకలో బుకింగ్స్ పరంగా ఈ చిత్రం అగ్రస్థానంలో దూసుకుపోతోంది. అక్కడ ఇప్పటికే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. కేవలం పాన్-ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లోనూ ‘టాక్సిక్’ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది.

హిందీ బెల్ట్‌లో ఇప్పటికే రూ.7.35 కోట్లకు పైగా బుకింగ్స్ జరిగాయి. నార్త్ అమెరికా (యూఎస్) ప్రీమియర్ బుకింగ్స్ ద్వారా 1.63 లక్షల డాలర్ల (సుమారు రూ.1.56 కోట్లు) కలెక్షన్లు వచ్చాయి. విదేశాల్లో ఈ సినిమా 260 లొకేషన్లలో, 709 ప్రాంతాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. విశేషమేమిటంటే యూఎస్‌లో కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌ బుకింగ్స్‌కే మంచి ఆధిక్యత లభించింది. ఇప్పటికే రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్‌’ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను అధిగమించిన ‘టాక్సిక్’.. థియేటర్లోకి వచ్చేసరికి మరిన్ని బిగ్గెస్ట్ మైలురాళ్లను దాటడం ఖాయమని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -