- Advertisement -

‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విషాదం.. వీడియో

- Advertisement -

రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత, భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలైనట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ దులపల్లి క్యాంపస్‌లో ‘టాక్సిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హీరో యష్ స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణంలో భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది.

హీరో మాట్లాడుతున్న ఆనందం క్షణాల్లోనే ఆందోళనగా మారింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక అమ్మాయి స్పృహ కోల్పోయినట్లు సమాచారం.

ఈ అనూహ్య ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -