- Advertisement -

వివాహేతర సంబంధానికి అడ్డొచ్చాడని భర్తను హతమార్చిన భార్య!

- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్న భర్తే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడనే దుర్బుద్ధితో కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య (36), శారద దంపతులు. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబం సజావుగా సాగుతున్న తరుణంలో వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది.

శారద తన వరుసకు కొడుకు అయ్యే శివ (19) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త దానయ్య వారిద్దరినీ పలుమార్లు తీవ్రంగా మందలించాడు. అయినా వారిద్దరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని శారద ప్లాన్ వేసింది.

ఈ నెల 23వ తేదీన శారద తన భర్త దానయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ మలవిసర్జనకు వెళ్తున్నానని చెప్పి, అప్పటికే పొలంలో పొదల్లో మాటువేసి ఉన్న శివ వద్దకు వెళ్ళింది. భార్య ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన దానయ్య చెట్ల పొదల్లో వెతికాడు.

అక్కడ శివ, శారద సన్నిహితంగా ఉండటం దానయ్య కంటపడింది. అది చూసి ఆగ్రహంతో ఊగిపోయిన దానయ్య, పక్కనే ఉన్న కర్రతో వాళ్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన శివ దానయ్య చేతిలోని కర్రను లాక్కున్నాడు. ఆ కర్రతోనే దానయ్య తలపై బలంగా కొట్టాడు.

ప్రాణభయంతో దానయ్య అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే వెంబడించిన శివ అతనిని రాయితో కొట్టడంతో దానయ్య కిందపడిపోయాడు. ఆ సమయంలో భార్య శారద కిందపడిన భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. వెంటనే శివ పెద్ద బండరాయితో దానయ్య తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

భర్తను హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు శారద నాటకం ఆడింది. తమ అన్న కనిపించడం లేదంటూ దానయ్య తమ్ముడు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పింది. కుటుంబ సభ్యులతో కలిసి వెతికిన శ్రీను, విగతజీవిగా పడి ఉన్న దానయ్య శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శారద ప్రవర్తనపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో శారద తన ప్రియుడు శివతో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -