- Advertisement -

‘ఏషనాగుల’ అంటూ అదరగొట్టిన నాని, కీర్తి!

- Advertisement -

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్‌ ఇండియా యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ప్యారడైజ్’ (The Paradise). టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సమస్త శీత్రకరణ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఓ మాస్‌ బీట్‌ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఏషనాగుల’ (Yeshanagula Song) అంటూ సాగే ప్రత్యేక పాటను శ్రోతల ముందుకు తీసుకువచ్చారు. ఈ పాటకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌ అదిరిపోయే స్వరాలు సమకూర్చారు.

ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్‌ ఈ పాటకు క్యాచీగా ఉండే సాహిత్యాన్ని అందించారు. జానపద శైలిలో సాగే ఈ పాటను ప్రభ బంగారిగళ్ళ, అద్దుల జంగిరెడ్డి ఎంతో ఉత్సాహంగా ఆలపించారు. ఇక ఈ పాటలోని వీడియోలో హీరో నాని, కథానాయకి కీర్తి సురేష్ తమ అద్భుతమైన మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. వీరిద్దరి జోడీ, ఎనర్జిటిక్ మూవ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ పాటకు విపరీతమైన స్పందన లభిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -