- Advertisement -

‘#KING 100’ గ్లింప్స్ వ‌చ్చేసింది!

- Advertisement -

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రంపై అధికారిక అప్‌డేట్ వచ్చేసింది. తాత్కాలికంగా ‘#KING 100’ అనే పేరుతో ఈ సినిమాను ప్రచారంలో ఉంచారు. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

విడుదలైన గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా సాగింది. ‘మనుషుల్లో రెండు రకాలు.. ఒకటి డబ్బున్న వాళ్లు, రెండు డబ్బులేని వాళ్లు’ అనే పవర్‌ఫుల్‌ డైలాగుతో నాగార్జున పాత్రను మేకర్స్ ఎంట్రీ ఇప్పించారు. ఈ డైలాగ్ సినిమా కథాబలాన్ని సూచిస్తోంది. కింగ్ నాగార్జున స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులను ఫిదా చేశారు. ఆయన మేనరిజం, బాడీ లాంగ్వేజ్ వింటేజ్ కింగ్‌ను తలపించేలా ఉన్నాయి. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

యువ దర్శకుడు రా.కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లోని ల్యాండ్‌మార్క్ మూవీ కావడంతో దర్శకుడు కథను చాలా జాగ్రత్తగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఈ చిత్రానికి సంబంధించిన మరో బిగ్ అప్‌డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. పుట్టినరోజు నాడే అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్ అందినట్లయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని మెగా, అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -