పవన్ కు ఆవేశమే…ఆలోచన లేదట…

జేసి దివాకర్ రెడ్డి పవన్ పై స్పందించారు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు గాని ఆలోచనల ,విశ్లేషణ లేకుండా రావడం సుద్ద దండగంటున్నారు.

 

ఆకాశంలోంచి నేలను చూడటం వేరు. నేల మీదికి వచ్చి ఇక్కడ అడుగడుగన ఉన్న ముళ్లును తొక్కి మసలడం రాజకీయాల్లో అంత సులువుగా ఉండదని పవన్ వైఖరిని ఉద్దేశింఛి జేసి ఈ వ్యాఖ్యలు చేశారు.

పవన్ కున్న ఆవేశం మంచిదే కాని అది ఆచరణకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు. అందుకే పవన్ ఇలా చులకనయ్యాడనేది జేసి వాదన. ఈ విషయంలో ఎవరు అవునన్నా కాదన్నా నిజమే అని పరిశీలకులు అంటున్నారు.