Wednesday, May 8, 2024
- Advertisement -

ఇప్పుడు కొరటాల వారి రేటు ఎంతో తెలుసా..!

- Advertisement -

కొరటాల శివ మాములోడు కాదు. ఎక్కడ ఎలా నరక్కు రావాలో భాగా తెలిసినవాడు. అంచానాలు పెంచకుండా ఒక్కసారిగా వచ్చి వేడి పుట్టించడం అతనికి తెలిసినంత బాగా…. బహుశా ఎవరికీ తెలియక పోయిండొచ్చు.

 

అందుకే శ్రీమంతుడుతో ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకున్నాడు. లేటెస్ట్ గా రేటు, రెమ్యునిరేషన్ రెండూ పెంచేసాడు. కొరటాలకు ద్వితియ విఘ్నం తొలగిపోవడానికి మెయిన్ రీజన్…. అతనిలో రైటింగ్ స్కిల్స్ పుష్కలంగా ఉండడం. 

త్రివిక్రమ్ తరహాలోనే ఇతను కూడా రైటర్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. అంతకు ముందు వచ్చిన దాసరి, జంద్యాల మొదలగు మేధావులు కూడా తొలుత రచయితలే. ఆ తరువాత దర్శకులుగా సక్సెసై తిరుగులేని స్టార్ డైరెక్టర్లుగా మారారు. ఇప్పుడు అదే రీతిలో నేటి తరంలో త్రివిక్రమ్ తర్వాత కొరటాల శివ నిలిచేలా కనిపిస్తున్నాడు. అందుకే శ్రీమంతుడుతో వచ్చిన హిట్ ను చూపించి, తర్వాత వెంచర్లకు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడట.

కొరటాల శివ శ్రీమంతుడు చిత్రం విషయంలోఎవరి మీదనో డిపెండ్ కాకుండా…. సొంత తెలివి తేటలు  ప్రదర్శించాడు. సినిమా ట్రైలర్ చూసిన వారందరికీ సినిమా తేలిపోతుందేమో అని అనుకునేలా చేశాడు. దీంతో సినిమా ఆడియన్స్ లో  ఎలాంటి అంచనాలు పెంచకుండా చేసింది. శ్రీమంతుడిని వర్కింగ్ టైటిల్‌గానే కొనసాగించి చివరి క్షణంలో మిర్చి తరహాలో మార్చి ….ఫైర్‌ ఉన్న టైటిల్ ను పెట్టాలనుకున్నాడు.

కానీ అప్పటికే శ్రీమంతుడు ప్రేక్షకుల్లోకి వెళ్లిపోవడంతో ప్రయోగాలు చేయకుండా సేఫ్ గేమ్ ఆడేశాడు. సినిమా చూసిన వారందరూ అసలు ట్రైలర్ ఇలా ఎందుకు రూపొందించాడా అని క్వశ్చన్ చేశారు. కారణం…

ట్రైలర్ చూపిస్తూ అంచనాలు తగ్గించి…, సినిమా చూపించి ఆలోచనలు పెంచడమే దానికి కారణం. ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టే…. తెలుగులో మరో మాంచి మ్యాటర్ ఉన్న దర్శకుల జాబితాలోకి కొరటాల కూడా చేరిపోయాడు. అన్నట్లు అసలు విషయం చెప్పలేదు కదా….పదికోట్లకు ఎక్కడా తగ్గడం లేదని ఇన్ సైడ్ టాక్ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -