Sunday, May 4, 2025
- Advertisement -

అలాంటి కబుర్లతో “రుద్రమదేవి” ని కాపాడుకొంటున్న దర్శకుడు!

- Advertisement -

ఇప్పటికే ‘రుద్రమదేవి’ సినిమా విడుదల అనేక మార్లుగా వాయిదా పడింది. సాధారణంగా ఇలా వాయిదా పడిన సినిమాలు ఆకట్టుకోవడం కొంచెం కష్టమైన పని.

ఎలాంటి సినిమా విషయంలో అయినా జనాలకు కొన్ని రోజులే ఆసక్తి ఉంటుంది. దీనికి అనేక రుజువులు ఉన్నాయి. మరి ఇప్పుడు రుద్రమదేవి ఏమో విడుదలకు నోచుకోవడం లేదు. ప్రస్తుతానికి అయితే సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  అయితే కచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించడం లేదు ఈ సినిమా యూనిట్.

ఇలాంటి నేపథ్యంలో తమ సినిమాపై ఆసక్తి తగ్గిపోకుండా.. జనాలు దీన్ని మరిచిపోకుండా ఉండటానికి అనేక టెక్నిక్స్ ను ఫాలో అవుతున్నారు దర్శకుడు గుణశేఖర్. ఏదో విధంగా ఈ సినిమాను వార్తల్లో నిలపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా తాజాగా  కొత్త విషయాన్ని ప్రకటించారు. ఈ సినిమా హిందీ హక్కుల ధరలు ఏకంగా 22 కోట్ల రూపాయల మొత్తానికి అమ్ముడయ్యాని అంటున్నారు. దేశ వ్యాప్తంగా హిందీ వెర్షన్ విడుదల హక్కులను ఒక సంస్థ ఆ మొత్తానికి కొనుక్కొందని చెబుతున్నారు. మరి ఇలా కొనుక్కోవడం సంతోషదాయకమైన అంశమే.

అయితే ఇంతకీ విడుదల ఎప్పుడు? అనేదే సందేహం. గుణశేఖర్ ఆర్థిక ఇబ్బందుల్లో పడటమే  ఈసినిమా విడుదలకు ప్రతిబంధకంగా మారినట్టుగా తెలుస్తోంది. పెద్ద బడ్జెట్ పెట్టడానికి సాహసం చేసిన ఈ  దర్శకుడు విడుదల విషయంలో మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. అయినా సినిమా టెంపోని కంటిన్యూ చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నాల వరకూ బాగానే ఉన్నాయి. భారీ బడ్జెట్ పెట్టిన గుణ ఈ సినిమాను సక్రమంగా విడుదల చేసి.. ప్రేక్షకుల మన్నన పొందుతాడని ఆశిద్దాం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -