మురుగదాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ దర్శకుడుతో సినిమా చేయడానికి హీరోలు వేచి చూస్తారు. ఇక్కడ చిరంజీవి నుంచి అక్కడ అమీర్ ఖాన్ వరకు పనిచేసాడు మురుగదాస్. ఇఅమ్త ఛరిష్మా.. చరిత్ర ఉన్న దర్శకుడిని కూడా ఓ హీరో భయపెట్టాడు. ఆయన ఎవరో కాదు మన చిరంజీవి.
చిరుతో మురుగదాస్ స్టాలిన్ సినిమా చేసాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. చిరుకి కథ బాగా నచ్చినప్పటికి.. ఆ సినిమాని హ్యాండిల్ చేయడంలో మురుగ తడబడ్డాడు. స్పైడర్ ప్రమోషన్స్ లో భాగంగా స్టాలిన్ ముచ్చట్లు కూడా చెప్పాడు ఈ దర్శకుడు. అప్పుడు తన వయసు కూడా చిన్నదని.. చిరంజీవి గారితో అవకాశం అనగానే ఎగ్జైట్ అయ్యానని.. దాంతో పాటు భయపడ్డానని చెప్పాడు మురుగదాస్. మెగాస్టార్ ఇమేజ్ ను లెక్క వేయడంలో తానే లెక్క తప్పానంటున్నాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో స్పైడర్ మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ఊహించినంత రెస్పాన్స్ రావడం లేదు. మురుగదాస్ పదేళ్ల తర్వాత కూడా మళ్లీ అదే తప్పు చేసాడేమో అంటున్నారు ప్రేక్షకులు. స్పైడర్ లో కథ పెద్దగా చెప్పుకోడానికి ఏం లేదు. దీన్ని ఇంటలిజెంట్ థ్రిల్లర్ గా చేయాలని ముందే ఫిక్సయ్యాడు మురుగదాస్.
కానీ తుపాకి రేంజ్ లో ఊహించుకుని వెళ్లిన వాళ్లకు మాత్రం మరో సినిమా చూపించాడు మురుగదాస్. దీన్నిబట్టి ఈయన తమిళ హీరోల ఇమేజ్ ను మాత్రమే బాగా క్యారీ చేస్తాడనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ భాష తెలుసు.. వాళ్ల ఇమేజ్ తెలుసు కాబట్టి లెక్కలు సరిగ్గానే వేసుకుంటున్నాడు. కానీ తెలుగుకి వచ్చేసరికి మాత్రం మురుగదాస్ లెక్కలు తప్పుతున్నాయి. అందుకే అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు మహేష్ బాబు.
