Sunday, May 19, 2024
- Advertisement -

అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

- Advertisement -

దేశంలో మ‌హిళ‌ల‌పైనె అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. అత్యాచార మ‌హిళా బాధితుల‌కు చ‌ట్టాలున్నాయి. అయితే మ‌గాళ్ల‌పై కూడా అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. అయితె ఇదే ఇప్పుడు దీనిపై దేశ వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధాన కార‌ణం అత్యాచారా బాధితులు ఆడ‌వాల్లే కాదు మగవాళ్లలోనూ అత్యాచార బాధితులు ఉంటారని దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు…త‌మ అభిప్రాయం చెప్పాల‌ని కేంద్రానికి నోటీసులు జారీచేసింది.

దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ కేసులో కేంద్రం అభిప్రాయాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 375, 376లను సవరించే దిశగా అడుగులు పడవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిరాల్లోకి వెల్తే సంజీవ్ కుమార్ అనే వ్య‌క్తి ఐపీసీ 375, 376 సెక్షన్లు పురుషుల పట్ల వివక్ష చూపుతున్నాయని, మహిళలను ఇవి అపరాధులుగా చేర్చడం లేదని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ సి హరిశంకర్‌ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్‌ కేం‍ద్రానికి నోటీసులు జారీ చేసింది.

మహిళలతో పోలిస్తే, పురుషులపై అత్యాచారాల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ, వాటిని కూడా చట్టం మరువరాదని వాదించారు. . రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో ఉన్న సమానత్వ హక్కును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించాడు. దీనిపై స్పందించాలని కేంద్రానికి నోటీసులు ఇస్తూ, కేసును అక్టోబర్ 23కు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -