సినీ ప్రపంచంలో.. ఇక్కడకు వచ్చాక.. మంచి పేరు సంపాదించాక.. వారి అభిరుచికి తగ్గట్లుగా.. నచ్చినవాళ్లు కనిపిస్తే.. ప్రేమలో పడిపోతుంటారు. కొంతమందైతే ఇష్టమైతే డేటింగ్ చేయడానికి ఇష్టపడుతారు. అంతేకాకుండా డేటింగ్ చేసాకా.. కూడా విడిపోతుంటారు.
ఇందంత సినీపరిశ్రమలో సర్వా సాధారణం. అలాంటిదే ఇప్పుడు ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకొని.. మంచి ఫేమ్ సంపాధించుకున్న సాయి పల్లవి చేస్తోంది. ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సాయిపల్లవి ఇప్పుడు ఒకరి ప్రేమలో పడి అతనితో డేటింగ్ చేస్తోందని తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు.. ఓకే బంగారం మూవీ తో సినీ పరిశ్రమకు పరిచయం అయిన దుల్కర్ సల్మాన్.
ఈ యువ హీరోతో కలిసి ఓయ్ పిల్లగాడా అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. సినిమా ఘూటింగ్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఆ ప్రేమ కాస్త ఇప్పుడు డేటింగ్ వరకు వెళ్ళిందట. మరి వీరి ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.
