గోవాలోని నాగచైతన్య, సమంతల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు సమంత కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివహాం జరిగింది. ఈ వివాహానికి సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే డబ్బుతో మాత్రమే తీసుకురాలేని సంతోషాన్ని, ఫీల్ ను ఆ కొత్త జంటకు అందించడంలో సక్సెస్ అయ్యారు ఇరు కుటుంబాలు.
ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని కుటుంబానికి సమంత కోడలు అవ్వగా, దగ్గుబాటి కుటుంబానికి సమంత కూతురు వరుస అవుతుందనే విషయం తెల్సిందే. రెండు ఫ్యామిలీల్లోనూ నాగచైతన్యకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంతను తమ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో పెళ్లి అయిన కొన్ని నిమిషాలకే సమంతకు షాక్ ఇచ్చారు.
అక్కినేని కుటుంబ సభ్యులు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు దాదాపు 30 మంది కలిసి ఒక ప్రత్యేకమైన వీడియోను తయారు చేయించారు. ఆ వీడియోలో సమంతకు తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ పాట పాడారు. ఈ వీడియో కోసం ఒక ప్రత్యేక పాటను ప్రత్యేకంగా ట్యూన్ చేయించారు. నాగార్జున ఈ వీడియోను దగ్గరుండి మరీ తయారు చేయించాడు. నాగచైతన్య కూడా ఈ వీడియోలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అంత మంది కలిసి వీడియో చేసినా కూడా సమంతకు మాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారట.
పెళ్లి అవ్వగానే ఆ వీడియోను ప్లే చేయడంతో సమంతకు కళ్ల వెంట నీళ్లు వచ్చాట. అంత పెద్ద ఫ్యామిలీలోకి తాను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. సమంతకు ఈ రెండు ఫ్యామిలీలు ఇచ్చిన గిఫ్ట్‌ను అతి పెద్ద సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌గా పెళ్లికి హాజరు అయిన అతిథులు చెబుతున్నారు. మొత్తానికి అనుకున్నట్లుగా రెండు ఫ్యామిలీలు కలిసి సమంతను సర్‌ప్రైజ్ చేశారు.