సర్ధార్ గబ్బర్ సింగ్ ఐటమ్ గర్ల్ ఎవరో క్లారిటీ వచ్చింది. ఆ సినిమాలో పవన్ పక్కన చిందేస్తూ అలరించబోయేది ఎవరో అర్థం అయ్యింది. ఈ అవకాశం దక్కింది మరెవరికో కాదు రాయ్ లక్ష్మీకి.
ఇది వరకూ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన లక్ష్మికి ఈ అవకాశం దక్కింది. పవన్ కల్యాణ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కు ప్రత్యేక ప్రాధాన్యత దక్కుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
‘గబ్బర్ సింగ్’ సినిమాలో కెవ్వు కేక పాట సూపర్ హిట్. ఇప్పటికీ ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటుంది ఆ పాట. ఈ నేపథ్యంలో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఐటమ్ సాంగ్ నుంచి అభిమానులు ఇంకా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ లో స్వయంగా పవన్ రంగంలోకి దిగి ఐటమ్ సాంగ్ ను రక్తికట్టించాడు. రాబోతున్న సీక్వెల్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ కు పవనే కీలకం.
గబ్బర్ సింగ్ విషయంలో ఐటమ్ సాంగ్ కు బాలీవుడ్ నుంచి ఐటమ్ గర్ల్ ను రప్పించారు. దబాంగ్ సినిమాలో మున్నీబద్నామ్ పాటలో నర్తించిన గర్ల్ నే రప్పించుకొన్నారు. ఈ సారి మాత్రం సౌత్ నుంచే అమ్మాయిని ఎంపిక చేసుకొన్నారు. ఈ పాట విషయంలో రాయ్ లక్ష్మి చాలా ఎగ్జయిట్ అవుతోంది. తనకు అదొక మంచి అవకాశంగా ఫీలవుతోంది. మరి ఆ పాటను రాయ్ లక్ష్మీ ఏ మేరకు రక్తి కట్టిస్తుందో చూడాలి!