తెలెంగాణాలో టీడీపీకి మరో దెబ్బ తగిలేలా లేదు. ఆపార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనె వార్తలు గుప్పుమంటున్నాయి. అధికారపార్టీ టీఆర్ ఎస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటోందన్న వార్తల నేపథ్యంలో టీడీపీలో ముసలం ముదిరింది. అధికార పార్టీపై దీటుగా విమర్శల దాడి చెసె రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఖండువా కప్పుకొనేందుకు రంగం సిధ్దమయ్యిందనె వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆగ్రహంగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనె వార్తలకు బలం చేకూరెలా రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండిస్తున్నప్పటికీ ఆయన చేస్తోన్న ప్రయత్నాలు మాత్రం మరోలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకుని చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో రాహుళ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చేనెల 9న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రేవంత్ ఆ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డితో పాటు ఆయన వెంట ఉన్న పలువురు టీడీపీ నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది.
తెలంగాణలో టిడిపి వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొంటే రాజకీయంగా భవిష్యత్ ఉండదనే అభిప్రాయంతో రేవంత్ వర్గీయులు ఉన్నారు. టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో జతకడితేనే టిడిపి బతికి బట్టకడుతోందనే అభిప్రాయం కూడ ఉంది. అయితే అదే సమయంలో టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో కొన్ని స్థానాలను దక్కించుకోవచ్చని మరికొందరు టిడిపి నేతలు కూడ ఆశతో ఉన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండాలనే విషయమై తాను చూసుకొంటానని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.
ఇక తెలంగాణాలో టీడీపీకి బలమైన నేత ఎవరంటె ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రేవంత్ రెడ్డి. అధికారపార్టీకి ధీటుగా సమాధానం చెప్పాలన్నా ….పార్టీని బలోపేతం చేయాలన్న రేవంత్ తోనె సాధ్యం. టీడీపీకి ప్రజాధరన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరితె తెలంగాణాలో టీడీపీ తన గుడారాన్ని పీకేయాల్సిందె.