Friday, May 9, 2025
- Advertisement -

బుట్టా రేణుక అలా అని ఎందుకు నాకు చెప్పలేదు.. జగన్ ఫైర్..!

- Advertisement -

రాజకీయాల్లో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. అందులోకి తొంగి చూడాలే కానీ కనిపించని ఎన్నో విషయాలు బయటపడుతాయి. అలాంటిదే కర్నూలు ఎంపీ బుట్టా రేణుక విషయంలో కనబడింది. విషయంలోకి వెళ్తే.. మూడురన్నర సంవత్సరాలుగా పార్టీలో ఉన్నారామె. టీడీపీలోకి చేరడానికి రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఓ రోజు చంద్రబాబుతో సమావేశమై బేరం సెటిల్ చేసుకుని టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఈ విషయంను జగన్ కేవలం వారం రోజుల ముందే తెలుసుకున్నారు. కానీ ఆమె మూడేళ్లుగా పార్టీలో అందరిని నమ్మించి, కళ్లకు గంతలు కట్టి టీడీపీలోకి వెళ్లిపోడాన్నే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాకపోతే తమ పార్టీలో కీలక నేతలు జగన్ బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలకు ఇదంతా తెలిసే జరిగిందని తెలిసింది. బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠం బాలినేనికి, సుబ్బారెడ్డికి బాగా సన్నిహితులు. ఆమె టీడీపీకి సన్నిహితంగా ఉంటోందని పార్టీలో ఎప్పుడు చర్చకు వచ్చినా అబ్బే అలాంటిదేం లేదు.. రేణు ఎటూ పోరు అని బుకాయించే వాళ్లు ఈ ఇద్దరు సీనియర్లు.

మొత్తానికి సీన్ రివర్స్ అయింది. రేణుకని వీళ్లు ఆపలేకపోయారు. ఆమెతో అంత సన్నిహితంగా ఉన్నవాళ్లే ఇలా నిజాల్ని దాచి తనను మోసం చేశారని జగన్ తెగ బాధపడిపోయారట. బాలినేని, సుబ్బారెడ్డి ని మరీ ఎక్కువ నమ్మానేమో అని అనుకుంటున్నారట జగన్. ఏది ఏమైన రేణుక టీడీపీలో చేరిన.. ఆమె పెట్టిన చిచ్చు ఇప్పుడు బాలినేనికి, సుబ్బారెడ్డికి అంటుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -