- Advertisement -

పవన్ కోబలి బాహుబలిపై పంతానికేనా ..?

- Advertisement -

పవర్ స్టార్ ,త్రివిక్రమ్ ల సినిమా అనగానే మాంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను రెండుసార్లు వీరిద్దరు రీచ్ అయ్యారు. ఇక మూడోస్సారి అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఐతే మూడోస్సారి అనుకుంటోన్న వెంచర్ కోబలి. బాహుబలి షూట్ జరుగుతున్న టైమ్లో దీన్ని అనుకున్నారు. అది కూడా జక్కన్న మీదున్న కోపంతోనే మెగా కాంపౌండ్ త్రివిక్రమ్ తో ఈసినిమాను ప్లాన్ చేసిందని చెపుకున్నారు. ఐతే పవన్ సర్దార్ ,త్రివిక్రమ్ అఆలతో బిజీ అయిపోవడంతో కోబలి మరుగున పడిపోయింది. తాజాగా ఈసినిమా గురించి త్రివిక్రమ్ ఇచ్చిన ఫుల్ స్క్రిప్ట్ పవన్ కు ఎంతగానో నచ్చిందని పరిశ్రమలో చెపుకుంటున్నారు.

ఈ సినిమాతో పవన్ బాహుబలి తరహా రికార్డ్ లపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. రాజమౌళి ఇక ఎలాగూ మెగా కాంపౌండ్ తో సినిమా చేయడని తేలిపోవడంతో  పవన్ ఇక లాభం లేదనుకుని త్రివిక్రమ్ తో కోబలికి కమిటైనట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబందించిన మరిన్ని ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ ను ఆద్యా మీడియా మీకందిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -