Monday, May 6, 2024
- Advertisement -

డ్యాన్స్ చేసినందుకు డైవర్సా…?

- Advertisement -

పశ్చిమాసియా దేశాల్లో…. మరీ ముఖ్యంగా అరబ్ కంట్రీస్ లో  మహిళల పట్ల చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అందుల్లోను పెళ్లైనవారి విషయంలో మరీ ఎక్కువ.

అక్కడ మగాళ్లది,మొగుళ్లదే రాజ్యం. పెళ్లైయ్యాక మ్యూజిక్ వినడం, పాటలు పాడటం, డ్యాన్స్ లు చేయడం లాంటివి చేయకూడదు. ఏం చేసినా చూసినా మతాన్ని చూపించే ఛానల్స్, సౌదీ ఛానల్స్ నే చూడాలి. లేదంటే గొడవలైపోతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుల్లో ఏముందిలే అని ఓ షేక్ గారి భార్య భావించింది. తన భర్త ఇంటినుంచి బయటకు వెళ్లిన వెంటే ప్రతి రోజు తనకిష్టమైన పాటలు వినడం, డ్యాన్స్ లు చేయడం లాంటివి చేస్తుంటుంది. ఐతే ఒక రోజు భర్త బయటకు వెళ్లాక ఎప్పటిలాగానే చాటుగా చేసుకునే డ్యాన్స్ ను మ్యూజిక్ వింటూ చేయడం మొదలు పెట్టింది. కరెక్ట్ గా అది ఆమె అదృష్టమో దురదృష్టమో గాని ఒక్కసారిగా తన భర్త అయినటువంటి షేక్ బాబు వచ్చేశాడు. తన ముందు ఎంతో వినమ్రంగా వినయంగా ఉండే భార్య అలా ఊగిపోవడం చూసి ఉద్రేకంతో తాను ఊగిపోయాడు. ఎక్కడ పెళ్లాన్ని చంపితే….తనని తమ దేశ చట్టాలు నడిరోడ్డు మీద ఉరి తీసేస్తాయనుకున్నాడో ఏమో…రిస్క్ ఎందుకిలే అనుకుని …తలాక్ చెప్పి డైవర్స్ ఇచ్చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -