- Advertisement -
టాలీవుడ్లో మెగా సంబరాలు అప్పుడే అయిపోయాయి అనుకోవడానికి వీల్లేదు. వారోత్సవాల తరహాలో మెగాస్టార్ బర్త్ డే వేడుకలు జరిగిన విషయం మనకు తెలిసిందే.
ఆ తర్వాత పవన్ బర్త్ డే వచ్చి… సామాన్యుడిని సైతం ఆకట్టేసుకుంది. ఇవి చాలవన్నట్లు ఇపుడు వరుస బెట్టి మెగా హీరోల సినిమాలు విడుదలకు నోచుకున్నాయి. ముందుగా కంచె ఆడియో లాంచ్ సెప్టెంబర్ 17న జరగబోతోంది. అక్కడ నుంచి మొదలై సెప్టెంబర్ 24న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా విడుదలకు నోచుకుంటుంది.
అక్టోబర్ 9 కి అల్లు అర్జున్ గోనగన్నారెడ్డిగా చేసిన రుద్రమదేవి, అక్టోబర్ 16న చెర్రీ బ్రూస్ లీ సినిమాలు మన ముందుకు వస్తున్నాయి,.అంటే సెప్టెంబర్ 17 నుంచి
అక్టోబర్ 16 వరకు ఏక బిగిన మెగా సినిమాలే… వారం వ్యవదిలో ఏదో ఒక రకంగా హల్చల్ చేస్తూ టాలీవుడ్ కు మెగా మంత్ ను పరిచయం చేయబోతున్నాయి.
