Tuesday, May 21, 2024
- Advertisement -

డ్రగ్ రాజధాని హైదరాబాద్ – యువత ప్రాణాలు గాల్లో !!

- Advertisement -

హైదరాబాద్ అంటే అందాలూ, అందమైన అమ్మాయిలూ, అబ్బాయిలూ, హైటెక్ సిటీలు, ఉద్యోగాలు, కోటి కలలే కాదు

వాటి వెనక ఎన్నో దారుణాలు కూడా దాగున్నాయి. దేశ విదేశాల నుంచీ స్మగ్లింగ్ అవుతున్న మాదక ద్రవ్యాల బాట లో సిటీ యువత పెడదారి పడుతున్నారు అనే అంశం మీద ప్రస్తుతం డిబేట్ నడుస్తోంది. యువత ప్రాణాలను పీల్చి నాశనం చేసే ఈ డ్రగ్స్ మహమ్మారి హైదరాబాద్ మహానగరం లో దారుణంగా వ్యాప్తి చెందింది. సినిమా నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నవర్గాల పిల్లలదాకా ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందినవారు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి వీరికి అందజేస్తున్నారు. అంతేగాకుండా ఇక్కడికి వస్తున్న మాదకద్రవ్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి.

హైదరాబాద్ ప్రధాన అడ్డగా సాగుతున్న ఈ వ్యాపారం శంషాబాద్ తో మొదలయ్యి దేశం లోని వివిధ ప్రాంతాల వరకూ విస్తరించింది. స్మగిలింగ్ కి పాల్పడే వారు కూడా యువత అవడం ఈ దందామొత్త చాలా చిన్న వ్యక్తుల చేతిలో ఉండడం ఈ దందా కోసం వారు కత్తులూ, గన్ లూ వాడడం దారుణమైన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. ఏటా దాదాపు యాభై మంది స్మగ్లర్లు దక్షిణ అమెరికా దేశాల నుంచి వివిధ పద్దతుల్లో కొకైన్ హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాల ని హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు.

ఎక్కడో ఒక చోట ఇద్దరు ముగ్గురు దొరుకుతున్నారు తప్ప వీరి గ్రూప్ మొత్తం ఒక్కసారిగా దొరకడం లేదు. దాదాపు నూట యాభై కోట్ల టర్నోవర్ తో ఏటా ఈ బిజినెస్ సాగుతోంది అంటే ఎంతగా హైదరాబాద్ లో కొకైన్ మాఫియా నడుస్తోందో అర్ధం చేసుకోవచ్చు.కేవలం కొకైన్ హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాల విషయం లోనే నెల కి ఇరవై  కోట్ల మేర వ్యాపారం జరుగుతోంది. కొకైన్ వాడుతూ, కొకైన్ సరఫరా చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయిన కేసులు నగరంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కడో ఉత్తర భారతదేశానికి చెందిన సంపన్న కుటుంబాల వారు హైదరాబాద్ శివార్లలో ‘రేవ్’పార్టీలు నిర్వహించుకుంటున్నారంటేనే ఇక్కడ డ్రగ్స్ ఎంత సులభంగా దొరుకుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌కు వస్తున్న మాదకద్రవ్యాలను వరంగల్, విశాఖపట్నం తో పాటు తమిళనాడు, గోవాలకు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఔరంగాబాద్, షోలాపూర్‌కు రవాణా చేస్తున్నారు. ఇందుకోసం 75% నైజీరియన్లు, 25% స్థానికులను వినియోగించుకుంటున్నారు. ముంబై నుంచి గోవాకు తరలింపులో ఇబ్బందుల కారణంగా స్మగ్లర్లు హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -