‘గునపం’ మూవీ ప్రమోషనల్ వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అటు పైరసీపై, ఇటు ఇండస్ట్రీపై సెటైరిక్ గా సాగే ఈ సినిమాకు సంబంధించి ప్రోమో విడుదల అయ్యింది.
అప్పుడే విడుదలైన సినిమాల పైరసీ సీడీలను కూడా సంతలో కాయగూరల్లా పెట్టి అమ్మేసే కాలం ఇది. మరి ఇలాంటి ట్రెండ్ పై ధ్వజమెత్తుతూ… సరదా ఫీచర్ ఫిల్మ్ ఇది. పేరు “గునపం”. టైటల్ వినడానికే వెరైటీగా ఉన్న సరదా సరదాగా సాగుతుంది. పైరసీ మార్కెట్ చేసే వారిపై ధ్వజమెత్తతూ… ఏదో సందేశాత్మక ఫిల్మ్ లా కాకుండా.. ఇదే సమయంలో ఇండస్ట్రీ పై సరదా సెటైర్లతో సాగుతుంది ఈ సినిమా! సురేష్ కలగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో.. సుమన్ షెట్టి, జెన్నీ వంటి కామెడియన్లు కూడా నటించారు. ఇకఈ సినిమా హీరో తన హావభావాలతో ఫైరింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు పోటీ వచ్చేలా ఉన్నాడు. ఉత్తమమైన టెక్నికల్ వ్యాల్యూవ్స్ రూపొందించిన ఈ సినిమా ప్రోమో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. మరి దీనిపై సరదాగా ఒక లుక్కేయండి! కడుపుబ్బా నవ్వుకోండి. ఈ గునపం మరో ‘హృదయకాలేయం’గా మారేలా ఉందండోయ్.
Watch Video:
{youtube}ALtuGzlpFeM{/youtube}
