Tuesday, April 30, 2024
- Advertisement -

హీరోయిజం …. హిట్టైన ఆ హీరోకు వద్దట…

- Advertisement -

కుర్రహీరోలు బాడా బాబుల స్టేజ్ కు ఎదిగినప్పుడు అతని ర్యాంక్ ,రేంజ్ ఏంటా అనే డౌట్ వస్తూ ఉంటుంది. యంగ్ హీరోలంతా మా బ్యాచ్ లో వీడే టాప్ అని ఒప్పుకున్నప్పుడు మాత్రం… ఆ డౌట్ పోతుంది. వన్స్ మనోడు బడా హీరో అని తోటి హీరోలే యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ సదరు హీరో ఎలా ఉండాలి. ఎంతో జాగ్రత్తగా చాకచక్యంగా మసులుతూ ఒకటికి రెండుసార్లు…ఆలోచించి డెసిషన్లు తీసుకోవాలి. కాని అదేంటో నేచురల్ స్టార్ నాని మాత్రం ఇంకా తనని తాను చిన్న హీరోగానే ట్రీట్ చేసుకుంటున్నాడు. అది ఒక రకంగా చూసేవారి పాయింట్ లో మంచిదే కావచ్చు. గుడ్ ఒపీనియన్ ను కలిగిస్తుంది కూడా. కాని మనం సెలెక్ట్ చేసుకునే చిత్రాలు, కథ, కథనాలు ,పాత్ర చిత్రీకరణ విషయంలో కూడా చోటా క్యారెక్టరైజేషన్ ఏమాత్రం మంచిది కాదు. హీరో స్థాయి ఇదీ అని చూపించే ప్రయత్నాన్ని ఆ తరహా చిన్న చూపు.. హీరోయిజాన్ని కిల్ చేస్తుంది. అభిమానులు కూడా తమ హీరో గారి బలుపును ఆస్వాదించలేకపోవచ్చు. బిటౌన్ వరకు ఇది ఓకే… బట్ మన సౌత్ కు వచ్చేసరికి మాలీవుడ్ లో తప్ప …ఇక్కడిది కరెక్ట్ కాదు.

ఈ విషయాన్ని నేచురల్ స్టార్ నాని ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో అతనికే తెలియాలి. ఇదే విషయాన్ని నాని దగ్గర కొందరు ప్రస్థావించినట్లు తెలిసింది. కాని నాని బాబు మత్రం ఇవేమి పట్టించుకోకుండా చల్తా అంటూ ఉన్నాడట. ఎందుకంటే తనకు వచ్చిన దాంట్లోనే హీరోయిజంలో పీక్స్ చూపిస్తాను తప్ప తన బాడీకి సెట్ కాని తలైవా తరహా స్టైల్ మనకొద్దు బాబు అంటున్నాడట. హిట్ అయిన ఏ హీరో అయినా ఓసారి తన హీరోయిజాన్ని మాస్ కు చూపించాలని తహతహ లాడతాడు. కాని అదేంటో నాని మాత్రం మనకు వచ్చిందే చేద్దాం రానిదాని గురించి ఆలోచించవద్దు అంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నడని తెలిసింది.ఈ విషయంలో నానిని మనం మెచ్చుకోకుండా ఉండలేం. బహుశ నానిలోని ఈ కోణం కూడా తోటి హీరోలకు అతను నచ్చేలా చేస్తుందేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -