Saturday, May 11, 2024
- Advertisement -

ఫుల్ స్వింగ్లో … బ్యూటీ సింగ్

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ .టాలీవుడ్లో మాంచి స్వింగ్ మీదున్న సుందరి. గతేడాది ధృవతో గ్రాండ్ గా 2016కు ముగింపు పలికి….. ఈ ఏడాది ఐదు సినిమాలతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఆ ఐదింటిలో ఏది అనుకున్నంత హిట్ కాలేదు. వాటిలో సాదా సీదా సినిమా… విన్నర్ ,ప్రెస్టీజియస్ వెంచర్ స్పైడర్ ఫిలింస్ ఉన్నాయి. ఇవేవి రకుల్ ను సంతోష పరచలేదు. ఖాకి ఏమైనా కలరింగ్ ఇస్తుందనుకుంటే దానికి న్యాయం జరగలేదు. దీనితో రకుల్ ఇక లాభం లేదనుకుంది. కాని అభిమానులు మాత్రం అనుకోలేదు ఎందుకో తెలుసా…ఆమె సినిమా సక్సెస్ అయినా కాకపోయినా..ఈమెను మాత్రం తెగ ఆరాదించేశారు. ఈవిడగారు చేసిన సీన్లు ,సాంగ్స్ ను యూ ట్యూమ్ లో కన్నార్పకుండా చూసేసి రకుల్ కు తాము ఎంత దాసోహమో చెప్పకనే చెప్పేస్తున్నారు.

తాజాగా రకుల్ ఈ ఏడాది నటించిన కొన్ని వీడియోను సరిగా చూసినట్లయితే.. వ్యూస్ విపరీతంగా వచ్చాయి. రకుల్ చేసినసినిమాలు ఫలితాలను ఇవ్వలేకపోయినా.. ఆమెలోని సోయగాలను చూడటం కోసం జనాలు బారులు దీరారు. సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చినా…కొందరు రకుల్ కోసం థియేటర్ కు వెళ్లారంటే విషయం అర్ధం చేసుకోవచ్చు. దిల్ రాజు ఈఏడాది 6 సినిమాలు నిర్మాణం చేసి ఎలా వండర్ క్రియేట్ చేశాడో ..అలాగే రకుల్ ఈ ఏడాది 5సినిమాలు అంటే తెలుగు, తమిళంలో కలుపుకుని చేసి గ్రేట్ అనిపించుకుంది. జయజానకి నాయక ఫిలింలో రకుల్ పర్ ఫార్మెన్స్ కోట్లు కుమ్మరించిందంటే ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ఈఏడాది ఫుల్ స్వింగ్లో ఉన్నటువంటి… బ్యూటీ సింగ్ ఈమెనే అని మనం కన్ఫామ్ చేసేసుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -