ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్న సమయం లో తదుపరి సినిమా కొబ్బరికాయ కొట్టడం అనే పంథా మహేష్ బాబు నుంచే అందరూ నేర్చుకోవాల్సిన మంచి అంశం.
బ్రూస్లీ షూటింగ్ చివరి దశ లో ఉండగా రాం చరణ్ తన తదుపరి సినిమాకి పూజా కార్యక్రమాలు చెయ్యాలనే ఆలోచన లో ఉన్నాడు. అక్టోబర్ 16న బ్రూస్లీ విడుదల అవుతుంది. టీవల తమిళంలో వచ్చిన సూపాట్ హిట్ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ గా రాం చరణ్ సినిమా రీమేక్ అవ్వబోతోంది. రాం చరణ్ ఈ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.
సురేందర్ రెడ్డి దర్సకత్వం లో ఉండబోతోంది ఈ చిత్రం. డీవీవీ దానయ్య – ఎన్వీ ప్రసాద్ కలిసి ఈ సినిమా ని నిర్మిస్తారు. బ్రూస్ లీ రిలీజ్ తర్వాత సురేందర్ రెడ్డి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేలోపు చరణ్ తను నిర్మాతగా చేయనున్న చిరు 150వ సినిమాకి కూడా లైన్ క్లియర్ చేయనున్నాడు.
నవంబర్ మొదటి వారం లో అధికారికంగా ఈ సినిమా మొదలు పెట్టి డిసెంబర్ నుంచీ రెగ్యులర్ షూటింగ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట.
