Saturday, May 18, 2024
- Advertisement -

ఆ సినిమా దిల్ రాజు ను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది!

- Advertisement -

ఇప్పుడు కాదు.. ఆ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే దిల్ రాజుకు ఇబ్బంది మొదలైంది. ఆ ఇబ్బంది బయటా పెట్టుకోలేడు.. అలాగని లోపలా దాచుకోలేడు.

ఓవరాల్ గా దిల్ రాజు పరిస్థితి ఇది. మరి అదేదో తను ప్రొడ్యూస్ చేసిన సినిమా కు సంబంధించిన ఇబ్బంది కాదు ఇది. ఎవరో సినిమాను నిర్మించి దానికి తన పేరును పెట్టి వదిలే సరికి రాజుకు ఇబ్బంది కలుగుతోంది. ఆ సినిమా మరేదో కాదు… “దిల్ రాజు ప్రేమలో పడ్డాడు”. చాన్నాళ్ల నుంచే ఈ చిన్ని సినిమా వార్తల్లో ఉంది. ఇన్ని రోజులూ ఏమైందో కానీ.. ఇప్పుడు ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

దీంతో రాజుకు ఇబ్బంది కలుగుతోంది.

ఇప్పటికే 50 యేళ్లకు దగ్గర పడ్డానని ప్రకటించుకున్నాడు దిల్ రాజు. అలాంటి వ్యక్తి పేరును వాడుకొంటూ… ప్రేమలో పడ్డాడు అనే ట్యాగ్ లైన్ ను జోడిస్తే అంతకన్నా ఇబ్బంది ఏముంది? దిల్ సినిమా ప్రొడ్యూసర్ గా రాజు దిల్ రాజుగా సర్థక నామధేయుడు అయ్యాడని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజు ప్రేమలో పడ్డాడనే టైటిల్ ఆయననే గుర్తు చేస్తుంది. అయితే ఈ ఇబ్బందిని రాజు బయటకు పెట్టుకోవడం లేదు. లైట్ తీసుకొంటున్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ జనాల్లో  మాత్రం ఈ సినిమా రాజు గురించి చర్చకు అవకాశం ఇస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -