- Advertisement -

ఆమె సొంత యాపారానికి ఏ పేరు పెట్టిందో తెలుసా..?

- Advertisement -

బాలీవుడ్ తారలు రకరకాల సినిమాలతో పాటు చేతిలో డబ్బులు ఎక్కువైతే… ఏమేం చేస్తారో వారికే తెలియదు. ఇపుడు శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా అదే పని చేస్తుంది. ఎంతో రిస్క్ అయినటువంటి హోటల్ వ్యాపారంలోకి జాక్వెలిన్ దిగింది. చుట్టూ ఫ్యాషన్,జ్యువెలరీ, ఫిట్ నెస్ రంగాలు ఉండగా ఎందుకు ఇలా ఎంట్రీ ఇచ్చిందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. పోతే పోయారు ఈవిధంగానైనా సెటిలయ్యే ఆలోచన వచ్చిందేమో అందుకే ఇలా చేసిందనుకోవచ్చు. కాని అదేంటో…అమ్మడు ఏకంగా తన వ్యాపారానికి కామసూత్ర పేరుతో టైటిల్ ఒకటి యాడ్ చేసింది.

అంతే రచ్చ రచ్చ అయిపోయింది. కామసూత్ర పేరుతో చైన్ హోటల్స్ ప్రారంభించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ముందుగా అమ్మడు ఈ వ్యాపారం శ్రీలంకలో చైన్ హోటల్స్ బిజినెస్ గా ప్రారంభించింది. త్వరలో ఆ చైన్ ను ఇండియాలో కూడా ప్రారంభించబోతుంది. కాని తన హోటల్స్ కు ఆమె పెట్టుకున్న పేరే ఇప్పుడు అక్కడ హాట్ డిస్కషన్ గా మారిపోయింది. ఈ పేరును జాక్వలిన్ ప్రకటించిన వెంటనే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అయినా ఏ పుట్టలో ఏపాముందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి..టైటిల్ ఇలా పెట్టుకోవడం వలన ఈ హోటల్లో ఇంకా ఏదో స్వర్గం చూపిస్తారని ఆశపడి వచ్చే కష్టమర్లు కూడా ఉంటారు.ఆ లెక్కలోనే జాక్వెలిన్ ఈ పేరు పెట్టిందేమో ఎవరు చూసొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -