- Advertisement -

ఏ స్టార్ హీరోకీ సాధ్యం కాని ఫీట్ అఖిల్ కే అవుతోంది!

- Advertisement -

ఇప్పటి వరకూ తెలుగు సినీ చరిత్రలో చాలా మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వివిధ ప్రముఖ సినీ కుటుంబాల నుంచి వచ్చిన వీరు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

అలాంటి వారసుల్లో ఎవరు ఏ స్థాయికి చేరారు అనేది పక్కనపెడితే తొలి సినిమాతో మాత్రం వారందరూ గొప్ప హైప్ నే క్రియేట్ చేశారు. తాము ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమాతో టాలీవుడ్ ను మొత్తం షేక్ చేసిన వారున్నారు వీరిలో. అయితే… అలాంటి వారందరిలో కెళ్లా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు అక్కినేని అఖిల్.

తన పేరుతోనే రూపొందుతున్న సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్న అఖిల్ సినిమా ఇప్పుడు తమిళంలోకి డబ్ అవుతోంది. తెలుగుతో పాటే ఈ సినిమా కోలీవుడ్ లోనూ ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ సినిమాను అక్కడ “సూర్యకవచం” పేరుతో డబ్బింగ్ చేశారు. తెలుగు నిర్మాత అయిన సి.కల్యాణ్ తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. మరి ఈ విధంగా తన ఆరంగేట్రం సినిమాతోనే అఖిల్ తమిళ ఇండస్ట్రీకి కూడా పరిచయం అవుతుండటం ఇక్కడ విశేషం.

ఇంతకు ముందు అనేకమంది సినీ వారసులు ఇండస్ట్రీకి పరిచయం అయినా.. ఇలా తమ తొలి సినిమాతోనే వారు పక్క భాషల ఇండస్ట్రీకి కూడా పరిచయడం కావడం జరగలేదు. కానీ అఖిల్ విషయంలో మాత్రం ఇది జరిగిపోతోంది. మరి అఖిల్ ఎంట్రీలోని గ్రాండ్ నెస్ కు ఇదీ ఒక రుజువేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -